LOADING...
#Viral Movement : ఐపీఎల్ చరిత్రలో విచిత్ర అవుట్.. నితీష్ రాణా అవుటైన తీరు చూసి అంపైర్లే షాక్
ఐపీఎల్ చరిత్రలో విచిత్ర అవుట్.. నితీష్ రాణా అవుటైన తీరు చూసి అంపైర్లే షాక్

#Viral Movement : ఐపీఎల్ చరిత్రలో విచిత్ర అవుట్.. నితీష్ రాణా అవుటైన తీరు చూసి అంపైర్లే షాక్

వ్రాసిన వారు Moogati Shabari
May 06, 2026
01:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్రికెట్ చరిత్రలో నితీష్ రాణా అవుటైన విధానం అంపైర్లకే ఆశ్చర్యాన్ని కలిగించింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ , చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అసాధారణ సంఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ తరఫున ఆడుతున్న నితీష్ రాణా అవుటైన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. అతను క్యాచ్ ద్వారా అవుట్ అయ్యాడా లేదా హిట్ వికెట్ అయ్యాడా అనే సందేహం అభిమానుల్లో తలెత్తింది.

వివరాలు

విచిత్రంగా అవుట్ అయ్యాడిలా..

ఈ ఘటన ఢిల్లీ ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో జరిగింది. నూర్ అహ్మద్ వేసిన మూడో బంతిని రాణా స్వీప్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ బంతి సరిగా తగలక బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ వద్ద ఉన్న ఫీల్డర్ చేతికి చేరింది. అదే సమయంలో బ్యాటర్ వెనుక ఉన్న స్టంప్స్ పై బెయిల్ కింద పడింది. దీంతో ఇది హిట్ వికెట్ కావచ్చని కొందరు భావించారు, క్యాచ్ చెల్లదని కూడా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తే, రాణా బంతిని ఆడకముందే ఒక బెయిల్ కింద పడిపోయినట్లు స్పష్టమవుతుంది. కానీ రాణా స్టంప్స్‌ను తాకలేదు. వికెట్ కీపర్ సంజు శాంసన్ కూడా బెయిల్స్‌ను తాకలేదు.

వివరాలు

మ్యాచ్‌కు ముందు భారీ వర్షం..

అయితే ఆ బెయిల్ పడిపోవడానికి కారణం వాతావరణ ప్రభావమే. మ్యాచ్‌కు ముందు ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో గాలి బలంగా వీచింది. కొంతసేపు ఆ గాలి తీవ్రత కారణంగా ఆటను కూడా నిలిపివేయాల్సి వచ్చింది. రాణా షాట్ ఆడే సమయానికి వీచిన బలమైన గాలివల్లే బెయిల్ కింద పడిపోయిందని అంపైర్లు నిర్ధారించారు. అందువల్ల దానిని హిట్ వికెట్‌గా కాకుండా క్యాచ్ అవుట్‌గా నిర్ణయించారు. ఈ గందరగోళ ఘటన మధ్య ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 155 పరుగులు మాత్రమే సాధించింది. అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ సులభంగా గెలుపొందింది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో..

Advertisement