LOADING...
Virat Kohli: విరాట్‌'ని చుట్టుముట్టిన అభిమానులు..సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌.. కోహ్లీకి తప్పని ఇబ్బంది!
విరాట్‌'ని చుట్టుముట్టిన అభిమానులు..సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌.. కోహ్లీకి తప్పని ఇబ్బంది!

Virat Kohli: విరాట్‌'ని చుట్టుముట్టిన అభిమానులు..సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌.. కోహ్లీకి తప్పని ఇబ్బంది!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 06, 2025
02:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం నిర్వహించిన ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమం వెలుపల చోటుచేసుకున్న తొక్కిసలాట విషాదంగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ఘటన జరిగిన రోజు భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లూ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీగా చేరిన అభిమానులు వారిని చుట్టుముట్టడంతో, పోలీసులకూ పరిస్థితిని నియంత్రించడం చాలా కష్టంగా మారింది. ఎలాగైనా విరాట్‌కు మార్గం చూపేందుకు పోలీసులు కృషి చేశారు. ఈ క్రమంలో విరాట్‌ను అభిమానుల మధ్య నుంచి రక్షిస్తూ తీసుకెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

వివరాలు 

విరాట్ కోహ్లీని భారీగా చుట్టుముట్టిన అభిమానులు 

ఆ రోజు ఉదయం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, బెంగళూరులోని విధానసౌధలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును సత్కరించారు. ఆ కార్యక్రమం ముగిసిన అనంతరం ఆటగాళ్లు చిన్నస్వామి స్టేడియానికి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ భారీగా అభిమానులు గుమిగూడటంతో కోహ్లీతోపాటు ఇతర క్రికెటర్లు అభిమానుల మధ్య చిక్కుకుపోయారు. పోలీసులు కూడా ఆ పరిస్థితిని ఎదుర్కోవడంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మొత్తానికి అతి కష్టమ్మీద ఆటగాళ్లను అక్కడినుంచి బయటపడేలా చేశారు. అయితే అప్పటికే వర్షం పడుతుండటం పరిస్థితిని మరింత క్లిష్టతరంగా మార్చింది.

వివరాలు 

11 మంది దుర్మరణం

ఈ సంఘటన జరిగిన కాసేపటికే.. స్టేడియం వెలుపల భారీ సంఖ్యలో అభిమానులు చేరటంతో తొక్కిసలాట జరిగింది. దీనిలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయాలపాలయ్యారు. విరాట్‌కోహ్లీ.. అభిమానుల మధ్య దాదాపు చిక్కుకుపోయిన స్థితిలో విధానసౌధ నుంచి బయటపడిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ దృశ్యాలు, కార్యక్రమ నిర్వహణలో నిర్వాహకుల వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదే..