LOADING...
Virat Kohli: ఆర్సీబీ vs లక్నో మధ్య భీకర పోరు.. కోహ్లీ వైపే అందరి చూపు
ఆర్సీబీ vs లక్నో మధ్య భీకర పోరు.. కోహ్లీ వైపే అందరి చూపు

Virat Kohli: ఆర్సీబీ vs లక్నో మధ్య భీకర పోరు.. కోహ్లీ వైపే అందరి చూపు

వ్రాసిన వారు Moogati Shabari
Apr 14, 2026
09:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్‌ 23వ మ్యాచ్ లో స్పెషల్ అట్రాక్షన్‌గా విరాట్ కోహ్లీ నిలువనున్నాడు. ఏప్రిల్ 15న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ హోమ్ గ్రౌండ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో ఆర్సీబీ మూడో స్థానంలో ఉంది. మరోవైపు లక్నో జట్టు రెండు విజయాలు, రెండు పరాజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎల్‌ఎస్‌జీపై కోహ్లీ రికార్డులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

వివరాలు

కోహ్లీ రికార్డులు ఇవే..

ఎల్‌ఎస్‌జీపై కోహ్లీ ప్రదర్శనను పరిశీలిస్తే, ఇప్పటివరకు ఆ జట్టుతో జరిగిన 6 ఐపీఎల్ మ్యాచ్‌లలో ఆయన మొత్తం 193 పరుగులు చేశారు. ఆయన సగటు 32.16గా ఉండగా, స్ట్రైక్‌రేట్ 133.1గా ఉంది. ఈ మ్యాచ్‌ల్లో కోహ్లీ రెండు అర్ధశతకాలు నమోదు చేశారు. అత్యధిక స్కోర్ 61. అలాగే 21 ఫోర్లు, 5 సిక్సర్లు బాదారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఎల్‌ఎస్‌జీపై రెండు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 83 పరుగులు చేశారు. ఈ గ్రౌండ్‌లో కోహ్లీ సగటు 41.5గా ఉండగా, ఒక అర్ధశతకం నమోదు చేశారు.

వివరాలు

300 సిక్సర్లకు దగ్గరగా కోహ్లీ..

ఇక ఐపీఎల్ 2026 సీజన్‌లో కోహ్లీ ఫామ్ అద్భుతంగా కొనసాగుతోంది. ఈ సీజన్‌లో ఆడిన 4 మ్యాచ్‌లలో ఆయన 179 పరుగులు సాధించారు. సగటు 59.66గా ఉండగా, రెండు అర్ధశతకాలు చేశారు. మొత్తం ఐపీఎల్ కెరీర్‌ను పరిశీలిస్తే, కోహ్లీ 271 మ్యాచ్‌లు (263 ఇన్నింగ్స్)లో 8,840 పరుగులు చేశారు. ఆయన సగటు 39.81గా ఉంది. ఇప్పటివరకు 65 అర్ధశతకాలు, 8 శతకాలు నమోదు చేశారు. అలాగే 300 సిక్సర్ల మైలురాయికి దగ్గరగా ఉన్న కోహ్లీ ప్రస్తుతం 298 సిక్సర్లతో నిలిచారు.

Advertisement