Page Loader
Virat Kohli: అంతర్జాతీయ క్రికెట్‌లో 16 ఏళ్లు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ
అంతర్జాతీయ క్రికెట్‌లో 16 ఏళ్లు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ

Virat Kohli: అంతర్జాతీయ క్రికెట్‌లో 16 ఏళ్లు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 18, 2024
04:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి నేటితో 16 ఏళ్లు పూర్తైంది. 2008 ఆగస్టు 18న శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచులో విరాట్ కోహ్లీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా లెక్కలేనన్ని రికార్డులను సృష్టించాడు. క్రికెట్ ప్రపంచంలో రన్‌మెషీన్‌గా పేరు తెచ్చుకొని టున్నుల కొద్ది పరుగులు సాధించి, భారత్‌కు అనేక విజయాలను అందించాడు. వన్డేల్లో క్రికెట్ దిగ్గజం సచిన్ తెండుల్కర్ సెంచరీల (49)ను అధిగమించిన విరాట్ (50) సరికొత్త రికార్డు సృష్టించాడు.

Details

 కోహ్లీ కెప్టెన్సీలో వన్డేల్లో 75.89 శాతం విజయాలు సాధించిన భారత్ 

భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఒక్క ఐసీసీ ట్రోఫీని గెలవకపోయినా, టీమిండియా జట్టు విజయవంతమైన కెప్టెన్లలో కోహ్లీ ఒకడు. విరాట్ కోహ్లీ నాయకత్వంలో వన్డేల్లో భారత్ 75.89శాతం విజయాలను నమోదు చేసింది. 2021లో టెస్ట్ క్రికెట్‌లో న్యూజిలాండ్‌ను 372 పరుగుల తేడాతో భారత్ కోహ్లీ కెప్టెన్సీలో ఓడించింది. ఇది టెస్టు క్రికెట్‌లో భారత్‌కు అతిపెద్ద విజయం. ఇది కాకుండా, విరాట్ కోహ్లీ 2011 లో వన్డే ప్రపంచ కప్, 2024 లో T20 ప్రపంచ కప్ కోసం భారత జట్టులో ఉన్నాడు.