
Virat Kohli : స్టన్నింగ్ క్యాచ్‌తో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా చైన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచులో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అద్భుత ఫీల్డింగ్‌తో ప్రశంసలు అందుకున్నాడు.
జస్ప్రిత్ బుమ్రా వేసిన మూడో ఓవర్ రెండో బంతిని ఆస్ట్రేలియా ఓపెనర్ మిచెల్ మార్ష్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ ఆ బంతి సైడ్ ఎడ్జ్ తీసుకొని స్లిప్‌లోకి వెళ్లింది.
సెకండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ డైవ్ చేసి క్యాచ్ పట్టాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను సాధించాడు.
భారత తరుపున అత్యధిక క్యాచులు పట్టిన ప్లేయర్ (నాన్ వికెట్ కీపర్)గా కోహ్లీ(15) నిలిచాడు.
కోహ్లీ తర్వాతి స్థానంలో కుంబ్లే (14), కపిల్‌దేవ్ (12), సచిన్ టెండూల్కర్ (12) ఉన్నాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
క్యాచ్ పడుతున్న కోహ్లీ
What a catch by Virat Kohli😲
— Abhishek (@Abhik_world) October 8, 2023
Dangerous #MitchellMarsh gone for duck 🦆
Well bowled #Bumrah#INDvsAUS pic.twitter.com/3jzEa1lau9