LOADING...
Virat Kohli : 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ అరుదైన రికార్డు.. 9000 పరుగులు పూర్తి
19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ అరుదైన రికార్డు.. 9000 పరుగులు పూర్తి

Virat Kohli : 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ అరుదైన రికార్డు.. 9000 పరుగులు పూర్తి

వ్రాసిన వారు Moogati Shabari
Apr 28, 2026
09:48 am

ఈ వార్తాకథనం ఏంటి

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 9 వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ఆటగాడిగా నిలిచి చరిత్ర సృష్టించాడు. సోమవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్‌లో వ్యక్తిగతంగా 11 పరుగులు చేసిన సమయంలోనే అతడు 9 వేల పరుగుల మార్క్‌ను దాటాడు.

వివరాలు

ఆర్సీబీపై ఘనత..

2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటివరకు 267 ఇన్నింగ్స్‌లలో మొత్తం 9012 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అతని తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్‌మ్యాన్‌గా పేరుగాంచిన రోహిత్ 271 ఇన్నింగ్స్‌లలో 7183 పరుగులు నమోదు చేశాడు.

వివరాలు

ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు:

విరాట్ కోహ్లీ - 267 ఇన్నింగ్స్‌లలో 9012 పరుగులు రోహిత్ శర్మ - 271 ఇన్నింగ్స్‌లలో 7183 పరుగులు శిఖర్ ధావన్ - 221 ఇన్నింగ్స్‌లలో 6769 పరుగులు డేవిడ్ వార్నర్ - 184 ఇన్నింగ్స్‌లలో 6565 పరుగులు కేఎల్ రాహుల్ - 144 ఇన్నింగ్స్‌లలో 5580 పరుగులు

Advertisement

వివరాలు

మ్యాచ్ వివరాలు ఇవే..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్‌సీబీ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు తట్టుకోలేక 16.3 ఓవర్లలో కేవలం 75 పరుగులకే ఆలౌట్ అయింది. ఢిల్లీ జట్టులో అభిషేక్ పోరెల్ 30 పరుగులు (33 బంతుల్లో 3 ఫోర్లు), డేవిడ్ మిల్లర్ 19 పరుగులు (18 బంతుల్లో 3 ఫోర్లు), కైల్ జేమీసన్ 12 పరుగులు (13 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. మిగతా బ్యాటర్లు అందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆర్‌సీబీ బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీశాడు. భువనేశ్వర్ 3 వికెట్లు సాధించాడు. రసిఖ్ , సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా తలో వికెట్ దక్కించుకున్నారు.

Advertisement

వివరాలు

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ..

76 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ, కేవలం 6.3 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. జట్టుకు దేవదత్ పడిక్కల్ 34 పరుగులతో (13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయంగా నిలిచాడు. విరాట్ కోహ్లీ 23 పరుగులతో (15 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) నాటౌట్‌గా నిలిచాడు. జాకబ్ బెథెల్ 20 పరుగులు (11 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) చేసి రాణించాడు. ఆర్‌సీబీ కోల్పోయిన ఏకైక వికెట్‌ను కైల్ జేమీసన్ తీశాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న ఆర్సీబీ పోస్ట్..

Advertisement