తదుపరి వార్తా కథనం
Virat Kohli: రంజీ ట్రోఫీలో విరాట్ కోహ్లీ.. రోజుకి పారితోషకం ఎంతంటే?
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 02, 2025
01:39 pm
ఈ వార్తాకథనం ఏంటి
విరాట్ కోహ్లీ ప్రస్తుతం దిల్లీ తరఫున రంజీ మ్యాచ్‌లలో పాల్గొంటున్నారు.
ఈ మ్యాచ్‌లో ఆడితే కోహ్లీ రోజుకు రూ.60,000 జీతం పొందతారు. మొత్తం 4 రోజుల పాటు జరిగే మ్యాచ్‌లలో రూ.2.40 లక్షల పారితోషికం లభించనుంది.
రంజీ ట్రోఫీలో 40 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే రోజుకు రూ.60,000
21-40 మ్యాచ్‌లు ఆడితే రూ.50,000, 20కంటే తక్కువ మ్యాచ్‌లు ఆడితే రూ.40,000, ఆరంగేట్ర ఆటగాడికి రూ.20,000 నుండి రూ.30,000 వరకు అందుతాయి.
Details
మహారాజా రంజిత్ పేరిట రంజీ ట్రోఫీ
భారతదేశంలో రంజీ ట్రోఫీ స్వతంత్ర భారతదేశానికి ముందు ప్రారంభమైంది.
బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు నవనగర్ (ప్రస్తుతం జామ్‌నగర్) మహారాజా రంజిత్ 1896-1902 మధ్య ఇంగ్లండ్ తరపున 15 టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు.
ఈ కారణంగా రంజీ ట్రోఫీకి అతని పేరు పెట్టారు. ఈ ప్రఖ్యాత టోర్నీ మొదటి సీజన్ 1934-35లో ప్రారంభమైంది.