
Virat Kohli: విరాట్ కోహ్లీ నా నిద్రతో చెలగాటమాడుతున్నారు : NBA జట్టు యజమాని
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తుతోంది. ఇప్పటికే ఆడిన ఆరు మ్యాచుల్లోనూ నెగ్గి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
నవంబర్ 2న భారత్, శ్రీలంకతో తలపడనుంది. ఈటోర్నీలో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నాడు.
ఆడిన 6 మ్యాచుల్లో 354 రన్స్ చేశాడు. ఇందులో ఓ సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలున్నాయి.
ఈ నేపథ్యంలో కోహ్లీపై NBA జట్టు యజమాని వివేక్ రణదివే అసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
విరాట్ మరోసారి గెలుపొందాడని, తాను ఉత్తర కాలిఫోర్నియాలో నివసిస్తున్నందున నిజంగా తన నిద్రను చెడగొట్టుతున్నారని చెప్పారు.
విరాట్ గెలుస్తూనే ఉండాలని, ఇంగ్లండ్‌ను ఓడించడం అద్భుతమని వివేక్ రణదివే సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను పంచుకున్నాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వివేక్ రణదివే చేసిన పోస్టు
NBA team @SacramentoKings owner is a fan of 👑
— A (@_shortarmjab_) October 30, 2023
Craze for Virat is unreal. Global superstar for a reason! pic.twitter.com/6eiIMiF8IP