
Virat Kohli: వన్8 కోసం విరాట్ కోహ్లీ భారీ త్యాగం . రూ.110 కోట్ల ఒప్పందాన్ని వదిలేశాడు!
ఈ వార్తాకథనం ఏంటి
గ్రౌండ్‌లో పరుగుల వర్షం కురిపిస్తూ అభిమానులను మంత్రముగ్ధం చేస్తున్న టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ, ఇప్పుడు బిజినెస్ రంగంలోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు.
తన స్వంత బ్రాండ్ అయిన వన్8(One8)కంపెనీని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాల్లో కోహ్లీ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు.
స్పోర్ట్స్‌వేర్, ఫుట్‌వేర్, దుస్తులు వంటి విభాగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న వన్8ను మరింత విస్తరించేందుకు కోహ్లీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు.
పూమా డీల్‌కు గుడ్ బై!
కోహ్లీ, జర్మన్ స్పోర్ట్స్ బ్రాండ్ 'పూమా'తో ఎనిమిదేళ్లుగా అనుబంధంలో ఉన్నాడు. ఈ బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న కోహ్లీ, దాదాపు రూ.110 కోట్ల విలువైన ఒప్పందాన్ని కలిగి ఉన్నాడు.
అయితే తాజాగా ఈ డీల్‌ను వదులుకునేందుకు కోహ్లీ సిద్ధమయ్యాడని మింట్ నివేదిక పేర్కొంది.
Details
పూమా ప్రమోషనల్ పోస్టులు డిలీట్
ఈ నేపథ్యంలో కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ గ్రిడ్ నుంచి పూమా ప్రమోషనల్ పోస్టులన్నింటినీ తొలగించినట్లు గుర్తించారు.
అవన్నీ ప్రస్తుతం రీల్స్ సెక్షన్‌కు మోహింపజేయడం విశేషం.
ఇక ఆయన గ్రిడ్‌లో ప్రస్తుతం వ్యక్తిగత పోస్టులు, వన్8 కు సంబంధించిన కంటెంట్ మాత్రమే కనిపిస్తోంది.
Details
వన్8 కు గ్లోబల్ ఫ్లేవర్.. అగిలిటాస్‌తో భాగస్వామ్యం
విరాట్ కోహ్లీ ఇప్పుడు కొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నాడు. అతను క్రీడా అథ్లెజర్ కంపెనీ అగిలిటాస్ లో పెట్టుబడిదారుడిగా చేరనున్నట్లు సమాచారం.
పూమా ఇండియా మాజీ మేనేజింగ్ డైరెక్టర్ అభిషేక్ గంగులీ 2023లో స్థాపించిన ఈ కంపెనీ, ఇటాలియన్ స్పోర్ట్స్ బ్రాండ్ లాటోకు భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలో దీర్ఘకాలిక లైసెన్స్ హక్కులు కలిగి ఉంది.
కోహ్లీ ఇప్పుడు తన వన్8 బ్రాండ్‌ను అగిలిటాస్ ద్వారా గ్లోబల్ మార్కెట్లోకి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అగిలిటాస్ గ్రోత్ లో వన్8 కీలక భాగస్వామిగా మారుతుంది.
పాదరక్షలు, స్పోర్ట్స్ డ్రెస్ విభాగాల్లో గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పూమా ప్రతినిధి కూడా కోహ్లీ డీల్ ముగిసిన విషయాన్ని ధ్రువీకరించారు.