Virat Kohli-Rohit Sharma: బ్రోమాన్స్ దృష్టి ఆకర్షించిన విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ
వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తుతోంది. ఆదివారం ధర్మశాలలోని హెచ్‌పిసిఎ స్టేడియంలో న్యూజిలాండ్‌పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచులో విరాట్ కోహ్లీ (95), రోహిత్ శర్మ (46) పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో బ్రోమాన్స్ దృష్టిని విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆకర్షించారు. ఈ వీడియోను ఐసీసీ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ లో షేర్ చేయడం విశేషం. ఈ వీడియోలో రోహిత్, కోహ్లీ ఒకే వీడియోలు బయల్దేరినట్లు చూడొచ్చు. అయితే ఈ వీడియో ఎప్పుడూ తీశారో స్పష్టత రావడం లేదు.
విరాట్ కోహ్లీ ప్రపంచ స్థాయి ఆటగాడు
ఈ మ్యాచులో మిచెల్ డారిల్ 127 బంతుల్లో 130 పరుగులు చేసి మూడో వికెట్‌కు రచిన్ రవీంద్రతో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో న్యూజిలాండ్ 273 పరుగులు చేయగలిగింది. విరాట్ కోహ్లీ ప్రపంచ స్థాయి ఆటగాడు అని, అతను వంద పరుగులు చేయకపోయినా భారత జట్టు తరుపున అద్భుతమైన ఆటను ఆడానని మిచెల్ పేర్కొన్నాడు. ఆ మ్యాచులో కివీస్ 20-30 పరుగులు ఎక్కువ చేసి ఉంటే బాగుండేదని చెప్పారు. భారత బౌలర్లలో కుల్దీప్ అద్భుతంగా రాణించాడని, అతను బ్యాటర్లపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడని, మైదానం వెలువల కూడా కుల్దీప్ తనకు తెలుసునని మిచెల్ వెల్లడించారు.