
వామ్మో.. రన్నింగ్‌లో బోల్ట్ కంటే వేగంగా పరిగెత్తిన కోహ్లీ
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ మైదానంలో చురుగ్గా ఫీల్డింగ్ చూస్తూ అభిమానులను అలరిస్తుంటాడు. ఫిట్‌నెస్ విషయంలో కోహ్లీని పలువురు క్రికెటర్లు ఆదర్శంగా తీసుకుంటుంటారు.
శుక్రవారం టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి వన్డేలో కోహ్లీ చేసిన ఓ ఫీల్డింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో విరాట్ కోహ్లీ వరల్డ్ ఫేమస్ అథ్లెట్ ఉసెన్ బోల్ట్ ను మించిపోయేలా పరిగెత్తాడు.
భారత్, ఆస్ట్రేలియా తొలి వన్డేలో 11ఓవర్ ను హార్ధిక్ పాండ్యా వేశాడు. ఆ ఓవర్లో వేసిన బాల్‌ను ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ మిచెల్ మార్ష్ మిడ్ వికెట్ వైపు ఆడాడు. అయితే మిడఎ వికెట్ వైపు ఫీల్డింగ్ చేస్తోన్న భారత ప్లేయర్లు బాల్ ను అందుకోవడంలో ఆలస్యం చేశారు.
విరాట్ కోహ్లీ
మొదటి వన్డేలో నిరాశపరిచన విరాట్ కోహ్లీ
అయితే షార్ట్ కవర్ వైపు ఫీల్డింగ్ చేస్తోన్న కోహ్లీ వెంటనే స్పందించి మిడ్ వికెట్ వైపు వేగంగా పరిగెత్తాడు. కేవలంలో ఆరు సెకండ్స్ లోనే బాల్ ను అందుకొని అశ్చర్యపరిచాడు.
ఈ వీడియోను చూసిన కోహ్లీ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. కోహ్లీ ఉసెన్ బోల్ట్‌ను మించేలా పరిగెత్తాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
మొదటి వన్డేలో కోహ్లీ కేవలం నాలుగు పరుగులకే ఔట్ అయ్యి నిరాశపరిచాడు. కేఎల్ రాహుల్, జడేజా రాణించడంతో టీమిండియా విజయం సాధించింది.