Page Loader
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన విరాట్ కోహ్లీ
టెస్టుల్లో 13వ స్థానంలో కొనసాగుతున్న విరాట్ కోహ్లీ

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన విరాట్ కోహ్లీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 15, 2023
06:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అదరగొట్టిన భారత ఆటగాళ్లు ఐసీసీ ర్యాంకింగ్స్ లో సత్తా చాటారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో సెంచరీతో సత్తా చాటిన టీమిండియా స్టార్ ఆటగాడు కింగ్ కోహ్లీ (705) ఏకంగా ఎనిమిది స్థానాలు మెరుగుపర్చుకున్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 13వ స్థానంలో కొనసాగుతున్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (739) పాయింట్లతో భారత్ నుంచి టాప్-10లో చోటు దక్కించుకోవడం విశేషం. ఆసీస్‌ బ్యాటర్ మార్నస్‌ లబుషేన్ (915) అగ్రస్థానంలో నిలిచాడు. టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్‌లో టీమిండియా స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

రవీంద్ర జడేజా

ఆల్ రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా అగ్రస్థానం

ఆల్‌రౌండర్ల జాబితాలో తొలి రెండు స్థానాలు భారత్‌ ఆటగాళ్లవే కావడం విశేషం. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో ప్లేయర్‌ ఆఫ్ ది సిరీస్‌ను ఉమ్మడిగా గెలుచుకున్న టీమ్ఇండియా ఆటగాడు రవీంద్ర జడేజా (431), రవిచంద్రన్ అశ్విన్ (359) వరుసగా మొదటి, రెండో ర్యాంక్‌లో నిలిచి సత్తా చాటారు. టాప్‌ -10 బౌలర్ల జాబితాలో అశ్విన్‌ కాకుండా సీనియర్‌ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (780) ఏడో స్థానంలో, రవీంద్ర జడేజా (753) 9వ స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం టెస్టుల్లో ఆస్ట్రేలియా 122 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. భారత్ 119 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో ఇంగ్లాండ్ (106) నిలిచింది.