
Virat Kohli: విరాట్ కోహ్లీ అరుదైన ఘనత.. ఐపీఎల్‌లో తొలి క్రికెటర్‌గా రికార్డు!
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఐపీఎల్ (IPL)లో అరుదైన ఘనత సాధించారు. నాలుగు జట్లపై వెయ్యి పరుగులు చేసిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించారు.
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), చెన్నై సూపర్ కింగ్స్ (CSK), పంజాబ్ కింగ్స్ (PBKS), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్లపై కోహ్లీ 1000 పరుగులు చేసి అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.
నిన్న రాత్రి ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఫీట్‌ను అందుకున్నారు.
ఈ మ్యాచ్‌లో 36 బంతుల్లో 59 పరుగులు చేసిన కోహ్లీ, మూడు సిక్సులు, నాలుగు ఫోర్లు బాదారు.
Details
ఆర్సీబీ విజయంలో కోహ్లీ కీలక పాత్ర
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) గెలుపులో కోహ్లీ కీలక పాత్ర పోషించారు. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ, మొదటి నుంచి దూకుడుగా ఆడి 16.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది.
బ్యాటింగ్‌లో ఫిల్ సాల్ట్ (56; 31 బంతుల్లో), బౌలింగ్‌లో కృనాల్ పాండ్య (3 వికెట్లు) సత్తా చాటాడు.
ఐపీఎల్‌లో నాలుగు జట్లపై వెయ్యి పరుగులు చేసిన తొలి ప్లేయర్‌గా నిలిచిన కోహ్లీ, తన అద్భుత ఫామ్‌తో మరోసారి అభిమానులను అలరించారు.