
Virat kohli: చిన్నస్వామిలో స్టేడియంలో చరిత్ర సృష్టించిన కోహ్లీ
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా 42వ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌కు బెంగళూరులోని ప్రసిద్ధ చిన్నస్వామి స్టేడియం వేదికగా మారింది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు రాజస్థాన్ రాయల్స్ తో తలపడుతోంది.
మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్, ముందుగా బౌలింగ్ ఎంచుకోవడంతో బెంగళూరు జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది.
వివరాలు
ఓపెనర్‌గా మరోసారి విరాట్ మ్యాజిక్
ఈ సీజన్ అంతటా విరాట్ కోహ్లీ అద్భుత ఫార్మ్‌లో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో నాలుగు అర్ధ సెంచరీలు సాధించి మొత్తం 322 పరుగులు నమోదు చేశాడు.
తాజాగా రాజస్థాన్‌తో జరిగిన ఈ తొమ్మిదవ మ్యాచ్‌లో కూడా తన మెరుగైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు.
కేవలం 32 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసిన కోహ్లీ, మొత్తంగా 42 బంతుల్లో 70 పరుగులు చేశాడు.
ఇందులో 8 బౌండరీలు, 2 సిక్సర్లు ఉన్నాయి. తన పటిష్ట ప్రదర్శనతోనే ఈ మ్యాచ్‌లో చరిత్ర సృష్టించాడు.
వివరాలు
చిన్నస్వామిలో కోహ్లీ రికార్డు
ఈ మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ చిన్నస్వామి స్టేడియంలో మొత్తం 3500 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
దీనితో ఈ స్టేడియంలో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి క్రికెటర్‌గా నిలిచాడు.
అంతేకాకుండా, టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే వేదికపై 3500 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా తన పేరు లిఖించుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో కోహ్లీ మూడు సిక్సులు కొడితే, మరో అరుదైన రికార్డు అతడి ఖాతాలోకి వచ్చేది.
టీ20 క్రికెట్‌లో (ఐపీఎల్, ఛాంపియన్స్ లీగ్ సహా) 300 సిక్సులు సాధించిన తొలి ఆర్సీబీ ఆటగాడిగా గుర్తింపు పొందేవాడు.
అయితే ఈ మ్యాచ్‌లో అతడు కేవలం రెండు సిక్సులకే పరిమితమయ్యాడు. దీంతో ఈ రికార్డు మాత్రం కొద్దిగా విఫలమైంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చిన్నస్వామిలో స్టేడియంలో చరిత్ర సృష్టించిన కోహ్లీ
Class, intent and everything in between. 🤌
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 24, 2025
pic.twitter.com/ry2tSm1dOX