టెన్త్ క్లాస్ మార్క్ షీట్‌ను షేర్ చేసిన విరాట్ కోహ్లీ
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తన టెస్ట్ సెంచరీ కరువును తీర్చకున్న కోహ్లీ... గురువారం తన 10వ తరగతి మార్క్ షీట్ సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేరే చేస్తూ ఫన్నీ కామెంట్స్ చేశాడు. తాను 2004లో పదో తరగతి చదువుతున్నప్పుడు క్రీడలు విద్యార్థి జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయనే అంశాన్ని జోడించలేదని, అది పాఠ్యంశాల్లో ఎలా తప్పిపోయిందో తనకు అర్ధం కాలేదని,తన మార్క్ షీట్ ఆధారంగా తన క్యారెక్టర్ గురించి చెప్పడం హాస్యాస్పదంగా కోహ్లీ చెప్పుకొచ్చాడు.
గత సీజన్‌లో నాలుగో స్థానంలో నిలిచిన ఆర్సీబీ
గత సీజన్లో ఫ్లేఆఫ్ కు అర్హత సాధించిన ఆర్సీబీ.. క్వాలిఫయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయి నాలుగో స్థానంలో నిలిచింది. ఐపీఎల్ 2023 వేలంలో ఆర్సీబీ రీస్ టాప్లీని రూ. 1.9 కోట్లు, విల్ జాక్స్‌ను రూ.3.2 కోట్లు, మనోజ్ భాండాగేను రూ.20లక్షలు, రాజన్ కుమార్‌ను రూ.70 లక్షలు, అవినాష్ సింగ్‌ను రూ.60లక్షలకు కొనుగోలు చేసింది. ఫాఫ్ డు ప్లెసిస్ (సి), విరాట్ కోహ్లీ, సుయాష్ ప్రభుదేసాయి, రజత్ పాటిదార్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్, గ్లెన్ మాక్స్‌వెల్, వనిందు హసరంగా, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ, కర్ణ్ శర్మ, మహిపాల్ లోమ్‌మర్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్, సిద్దార్థ్ కౌల్, ఆకాష్ దీప్ వంటి ఆటగాళ్లను ఆర్సీబీ రిటైన్ చేసుకుంది.