Virat Kohli: విరాట్ కోహ్లీని 'చీకు' అని పిలవడం వెనుక ఉన్న కారణాలివే!
అందరిలాగే స్టార్ క్రికెటర్లకు కూడా ముద్దు పేర్లు ఉంటాయి. ఒకానొక సందర్భంలో అవి బయటపడతాయి. ఇంటర్వ్యూలు, మ్యాచులు జరుగుతున్న సమయంలో ఈ పేర్లు లీక్ అవుతుంటాయి. తాజాగా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీని 'చీకు' అని పిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ పేరు ఎందుకు వచ్చిందో మనం తెలుసుకుందాం. 'చీకు' అనే పేరు 2007లో కోహ్లీ డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్నప్పుడు వచ్చింది. అప్పటి సమయంలో కోహ్లీ తన జుట్టును చిన్నగా కత్తిరించుకున్నాడు. అది గుండ్రంగా కనిపించే ముఖం, చెవులను పెద్దగా కనపడటంతో కోహ్లీ డొమెస్టిక్ క్రికెట్ కోచ్ 'చీకు' అని కుందేలు క్యారెక్టర్‌తో సరాదాగా పిలిచారు. కోహ్లీ మైదానంలో యాక్టివ్‌గా ఉండడం, వేగంగా పరిగెత్తడం వల్ల కూడా ఆ పేరు వచ్చింది.
ధోనీ వల్ల 'చీకు' పేరు పాపులర్
ఇక అప్పటి నుండి కోహ్లీ అభిమానులు అతన్ని సరాదాగా చీకు అని పిలుస్తున్నారు. కోహ్లీకి 'చీకు' పేరు ఫ్యాన్స్‌కి తెలిసేలా చేసేది భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ. మ్యాచ్‌ల సమయంలో స్టంప్‌ల వెనుక ధోనీ కోహ్లీని 'చీకు' అని పిలిచేవాడు. పిచ్ వద్ద ఉండే మైక్రోఫోన్‌లలో ఇది రికార్డు అయ్యింది, దీంతో అభిమానులు ఈ పేరుతో కోహ్లీని పిలవడం ప్రారంభించారు. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ పీటర్సన్‌తో జరిగిన ఇన్‌స్టాగ్రామ్ చాట్‌లో విరాట్ ఈ 'చీకు' స్టోరీని పంచుకున్నాడు. ధోనీ వల్ల ఈ పేరు పాపులర్ అయిందని, అతను స్టంప్స్ వెనుక నుంచి తనను 'చీకు' అని పిలిచేవారని గుర్తు చేశారు. అది విని ఫ్యాన్స్ కూడా ప్రేమగా చీకు అని పిలుస్తున్నారు.