Page Loader
Virender Sehwag: విడాకులు తీసుకోనున్న మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌..?
విడాకులు తీసుకోనున్న మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌..?

Virender Sehwag: విడాకులు తీసుకోనున్న మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌..?

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 24, 2025
08:17 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ దిగ్గజం, డ్యాషింగ్ ఆడే ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, అతని భార్య ఆర్తి అహ్లావత్ విడిపోనున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. 21 ఏళ్ల దాంపత్య జీవితం ముగించేందుకు వీరు సిద్ధమవుతున్నారని సమాచారం. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నట్లు సమాచారం. ఈ పరిణామం వారి విడాకుల వార్తలకు బలాన్నిస్తోంది. అంతేకాదు, కొన్ని రోజులుగా వీరిద్దరూ వేర్వేరుగా నివసిస్తున్నారనే వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. దీంతో త్వరలోనే వీరు విడాకులు తీసుకుంటారని సమాచారం లభిస్తోంది.

వివరాలు 

 దీపావళి వేడుకల సందర్భంగా సెహ్వాగ్ ఫొటోలు.. 

వీరేంద్ర సెహ్వాగ్, ఆర్తి అహ్లావత్ 2004లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 2007లో ఆర్యవీర్, 2010లో వేదాంత్ జన్మించారు. 20 ఏళ్ల పాటు సాఫీగా కొనసాగిన వారి దాంపత్య బంధంలో విబేధాలు వచ్చినట్లు సమాచారం. గత సంవత్సరం దీపావళి వేడుకల సందర్భంగా సెహ్వాగ్ కొన్ని ఫొటోలు షేర్ చేశాడు. ఆ ఫొటోలలో అతని భార్య ఆర్తి ఎక్కడా కనిపించలేదు. తన కుమారులు, తల్లితో మాత్రమే ఉన్న ఫొటోలను అతడు షేర్ చేశాడు. ఆర్తి పేరును ప్రస్తావించకపోవడంతో నెటిజన్లు ఆర్తి గురించి ప్రశ్నించడం మొదలుపెట్టారు.

వివరాలు 

సెహ్వాగ్, ఆర్తి 2000లో ప్రేమలో..

ఇటీవల, రెండు వారాల క్రితం సెహ్వాగ్ కేరళలోని పాలక్కాడ్ విశ్వ నాగయక్షి ఆలయాన్ని సందర్శించాడు. అక్కడ తీసుకున్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫొటోలలోనూ ఆర్తి ఎక్కడా కనిపించకపోవడం, ఆమె గురించి ప్రస్తావన లేకపోవడం చర్చనీయాంశమైంది. సెహ్వాగ్, ఆర్తి 2000లో ప్రేమలో పడినట్లు సమాచారం. నాలుగేళ్ల ప్రేమ సంబంధానికి ముగింపుగా 2004లో పెళ్లి చేసుకున్నారు. ఢిల్లీకి చెందిన ఆర్తి అహ్లవత్.. లో ప్రొఫైల్‌ మెయింటేన్ చేస్తారు. ఆమె డిసెంబర్ 16, 1980న జన్మించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం మైత్రేయి కళాశాల నుంచి కంప్యూటర్ సైన్స్‌లో డిప్లొమా పూర్తి చేశారు.