
Virendra Sehwag: ఐపీఎల్ లో బెంగళూరు పేలవ ప్రదర్శన...సెహ్వాగ్ రియాక్షన్
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ మ్యాచ్లలో బెంగళూరు జట్టు పేలవ ప్రదర్శన పట్ల మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు.
కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ ఒక్కడే జట్టును ఆదుకోలేడని, కనీసం ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లైనా మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన కనబరచాలని అభిప్రాయపడ్డాడు.
విరాట్ కోహ్లీపైనే జట్టు భారం మోపడం సరికాదన్నాడు. బెంగళూరు ఆడిన నాలుగు మ్యాచ్లలో ఒకటి మాత్రమే గెలిచి మూడు మ్యాచ్లను ఓడిపోయింది.
దీంతో పాయింట్ల పట్టికలో అడుగునుంచి రెండోస్థానంలో బెంగళూరు జట్టు నిలిచింది.
రేసులో ముందుకెళ్లాలంటే ప్రతి మ్యాచ్లోనూ అద్భుత ప్రదర్శన చేస్తూ మ్యాచ్లను గెలుచుకోవాలని సూచించాడు.
బెంగళూరు జట్టులో ఫాప్ డూప్లెసిస్, కామెరూన్ గ్రీన్, గ్లెన్ మాక్స్వెల్ ఉన్నా అంతగా ప్రభావం చూపించడంలేదన్నారు.
Details
లక్నోనిర్దేశించిన లక్ష్యం పెద్దదేమీ కాదు
ఇప్పటివరకు బెంగళూరు జట్టు ఆడిన మ్యాచ్లలో విరాట్ కోహ్లీ మాత్రమే మంచి ప్రదర్శన కనబరిచారు.
ఇక ఆ జట్టులో కీలకమైన నాలుగో స్థానంలో 360 డిగ్రీల ప్లేయర్ ఏబీ డీవిలియర్స్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని సెహ్వాగ్ తో కలసి మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అభిప్రాయపడ్డాడు.
మంగళవారం నాటి మ్యాచ్ లో లక్నోనిర్దేశించిన లక్ష్యం పెద్దదేమీ కాదని, తడబడకుండా క్రీజులో నిలిచుంటే పరుగులు వాటంతటవే వచ్చుండేవని అభిప్రాయపడ్డారు.
ఫ్రాంచైజీలు ఆశించేది ప్రతి స్టార్ ఆటగాడు ఒకటి రెండు మ్యాచ్లో రాణించి మిగతా మ్యాచ్లో నిలకడను ప్రదర్శించాలని.
గ్లెన్ మ్యాక్స్వెల్, డుప్లెసిస్ ల నుంచి కొన్ని మంచి ఇన్సింగ్స్ ను అందరూ ఆశిస్తున్నారని, తనదైన రోజున మ్యాక్స్ వెల్ విన్సింగ్సే ఆడగలడని అభిప్రాయపడ్డారు.