Page Loader
ODI Tickets: 10 నుంచి విశాఖ వన్డే టికెట్ల అమ్మకం
మార్చి 19న టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే

ODI Tickets: 10 నుంచి విశాఖ వన్డే టికెట్ల అమ్మకం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 08, 2023
11:35 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈనెల 19న జరిగే రెండో వన్డే టికెట్ల అమ్మకం ఈనెల 10 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆఫ్‌లైన్‌లో ఈనెల 13 నుంచి టికెట్లు విక్రయాలు జరగనున్నాయి. ఆఫ్ లైన్ లో టికెట్ల అమ్మకాల కోసం నగరంలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకున్న వారు ఈనెల 13వ తేదీ నుంచి ఆఫ్‌లైన్ కేంద్రాల వద్ద టికెట్లు పొందాల్సి ఉంటుంది. టికెట్ల ధరలు రూ.600, రూ.1,500, రూ.2,000, రూ.3,000, రూ.3,500, రూ.6,000గా నిర్ణయించినట్టు వెల్లడించారు.

టీమిండియా

మార్చి 19న రెండో వన్డే

విశాఖలో దాదాపు నాలుగేళ్ల తర్వాత అంతర్జాతీయ వన్డే మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో విజయవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఆంధ్ర క్రికెట్‌ సంఘం (ఏసీఏ) కార్యదర్శి గోపీనాథరెడ్డి పేర్కొన్నారు. నగరంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో భారత్‌, ఆస్ర్టేలియా జట్ల మధ్య ఈనెల 19న జరిగే రెండో వన్డే జరగనుంది. టికెట్లు హాట్ కేక్‌లు అమ్ముపోయే అవకాశం ఉన్నట్లు క్రికెట్ మేధావులు చెబుతున్నారు.