LOADING...
ILT20 2024 : దుబాయ్ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వార్నర్ నియామకం
దుబాయ్ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వార్నర్ నియామకం

ILT20 2024 : దుబాయ్ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వార్నర్ నియామకం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 01, 2024
01:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ (David Warner) ఇంటర్నేషనల్ లీగ్ టీ20-2024లో భాగం కానున్నాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడిన అతను, దాని అనుబంధ జట్టు దుబాయ్ క్యాపిటల్ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఏకంగా దుబాయ్ క్యాపిటల్స్ జట్టుకు డేవిడ్ వార్నర్ సారథ్య బాధ్యతలను తీసుకున్నాడు. ఈ విషయాన్ని క్యాపిటల్స్ యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కెప్టెన్ మార్కెల్ అంటూ పోస్టర్‌ను విడుదల చేసింది. టీమిండియా స్టార్ రిషబ్ పంత్ గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరం కావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ సారిథిగా వార్నర్ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే.

Details

దుబాయ్ క్యాపిటల్స్ జట్టు ఇదే

ఇక దుబాయ్ క్యాపిటల్స్ కు తొలి ఎడిషన్ (2023)లో వెస్టిండీస్ స్టార్ ఆటగాడు రోవ్‌మన్ పావెల్ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. జనవరి 13 నుంచి ఐఎల్ టీ20-2024 ఎడిష్ ప్రారంభం కానుంది. దుబాయ్‌ క్యాపిటల్స్‌ జట్టు డేవిడ్‌ వార్నర్‌(కెప్టెన్‌), ఆండ్రూ టై, దసున్‌ షనక, దుష్మంత చమీర, జో రూట్‌, మార్క్‌ వుడ్‌, మాక్స్‌ హోల్డెన్‌, మొహమ్మద్‌ మొహ్సిన్‌, నువాన్‌ తుషార, రహ్మనుల్లా గుర్బాజ్‌, రజా ఆకిఫ్‌, రోవ్‌మన్‌ పావెల్‌, రోలోఫ్‌ వాన్‌డెర్‌ మెర్వే, సదీర సమరవిక్రమ, సామ్‌ బిల్లింగ్స్‌, సికిందర్‌ రజా.