Jasprit Bumrah-Chris Martin: బుమ్రా లాయర్ నుంచి హెచ్చరిక.. లేఖ చదవకపోతే జైలుకు పంపుతారంటున్న సింగర్
ఈ వార్తాకథనం ఏంటి
బ్రిటిష్ రాక్‌బ్యాండ్ కోల్డ్‌ప్లే కాన్సర్ట్‌లో సింగర్ క్రిస్ మార్టిన్ మరోసారి భారత స్టార్ క్రికెటర్ జస్పిత్ బుమ్రా పేరును ప్రస్తావించారు.
ముంబయిలో డీవై పాటిల్ స్టేడియంలో మంగళవారం రాత్రి జరిగిన చివరి షోలో మార్టిన్ షోను కొద్దిసేపు ఆపి, తనను క్షమించమని కోరుతూ ఒక లేఖ చదివారు.
బుమ్రా లాయర్ నుంచి ఒక లేఖ వచ్చిందని, దానిని చదవాలి, లేదంటే మమ్మల్ని జైలుకి పంపొచ్చని పేర్కొన్నారు. అహ్మదాబాద్‌లో కాన్సర్ట్ చేయలేకపోవచ్చని నవ్వుతూ అన్నారు.
తరువాత లేఖలోని వాక్యాలను చదివారు: ' ఇంతకుముందు జరిగిన రెండు షోల్లో మీరు అనుమతి లేకుండా బుమ్రా పేరు ఉపయోగించారన్నారు.
Details
నవ్వు తెప్పిచిందన్న బుమ్రా
, ఇది చట్టవిరుద్ధమని, బుమ్రా ప్రపంచ స్థాయి బౌలర్. మీరు కేవలం ఒక సిల్లీ సింగర్ అని చదివారు. మరుసటి దశలో, బుమ్రా ఇంగ్లాండ్ బ్యాటర్‌ను 2024 సిరీస్‌లో ఔట్ చేసిన వీడియోను ప్రదర్శించారు.
దీనితో ప్రేక్షకులను ఉత్సాహపరిచారు. గత వారాంతంలో మార్టిన్ డీవై పాటిల్ స్టేడియంలో రెండు కాన్సర్ట్లు నిర్వహించారు.
ఈ సందర్భంలో ఆయన అభిమానులను ఉత్సాహపరిచేందుకు "స్టేజ్ వెనక బుమ్రా ఉన్నాడని" చెప్పి షోను కాసేపు ఆపాలని కోరారు.
కానీ అది నిజం కాదని క్షమాపణలు కోరుతూ బుమ్రా క్లిప్‌ను ప్రదర్శించారు. ఈ అంశంపై బుమ్రా స్పందిస్తూ, ఇది నాకు నవ్వు తెప్పించిందని, ఈ కాన్సర్ట్ ఎంతో ప్రత్యేకమని తెలిపారు.