Page Loader
MS Dhoni: ధోని నాటౌటేనా? థర్డ్ అంపైర్ నిర్ణయంపై సోషల్ మీడియాలో అభిమానుల ఆగ్రహం!
ధోని నాటౌటేనా? థర్డ్ అంపైర్ నిర్ణయంపై సోషల్ మీడియాలో అభిమానుల ఆగ్రహం!

MS Dhoni: ధోని నాటౌటేనా? థర్డ్ అంపైర్ నిర్ణయంపై సోషల్ మీడియాలో అభిమానుల ఆగ్రహం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 12, 2025
10:29 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025 సీజన్‌లో చైన్నై సూపర్ కింగ్స్ (CSK) తటస్థంగా పేలవ ప్రదర్శన చూపుతోంది. వరుసగా ఐదో మ్యాచ్‌లో ఓడిపోవడం గమనార్హం. శుక్రవారం చెన్నై చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (KKR) చేతిలో 8 వికెట్ల తేడాతో చెన్నై పరాజయం పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ఎంఎస్ ధోని ఔట్‌కు సంబంధించి సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జోరుగా సాగుతోంది. ఈ మ్యాచులో చైన్నై ప్రారంభం నుంచే వికెట్లు వరుసగా కోల్పోయింది. రచిన్ రవీంద్ర(4), కాన్వే (12), త్రిపాఠి (16), అశ్విన్ (1), జడేజా (0), దీపక్ హుడా (0), విజ‌య్ శంకర్ (29)లు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. 72 పరుగులకే 7 వికెట్లను చైన్నై కోల్పోయింది.

Details

రారా

ఈ స్థితిలో ధోని ముందుగా క్రీజులోకి వచ్చి జట్టును ఆదుకుంటాడని అంతా భావించారు. కానీ అంచనాలు తలకిందులయ్యాయి. ధోని తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. కేవలం నాలుగు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేసి సునీల్ నరైన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. 8వ వికెట్‌గా వెనుదిరిగాడు. ధోని ఔట్ తీరుపై వివాదం చెలరేగింది. నరైన్ వేసిన బంతిని డిఫెండ్ చేయబోతూ, ధోని ప్యాడ్లకు తాకింది. కోల్‌కతా ఆటగాళ్ల అప్పీల్‌కు ఫీల్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించగా, వెంటనే ధోని డీఆర్‌ఎస్ కోరాడు. రిప్లేలో బంతి బ్యాట్‌ను దాటి వెళ్లిన సమయంలో అల్ట్రా ఎడ్జ్‌లో చిన్న స్పైక్స్ కనిపించాయి.

Details

8 వికెట్ల తేడాతో కేకేఆర్ గెలుపు

అయినప్పటికీ థర్డ్ అంపైర్, ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్నే నిలబెట్టాడు. ఇది అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. థర్డ్ అంపైర్ తీర్పుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 103 పరుగులే చేయగలిగింది. అనంతరం కోల్‌కతా బ్యాటర్లు ధాటిగా ఆడారు. సునీల్ నరైన్ 18 బంతుల్లో 44 పరుగులు (2 ఫోర్లు, 5 సిక్సర్లు), క్వింటన్ డికాక్ (23), అజింక్యా రహానే (20 నాటౌట్), రింకూ సింగ్ (15 నాటౌట్)లతో కలిసి లక్ష్యాన్ని 10.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి సులభంగా చేధించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్న అభిమానులు