Page Loader
Shubman Gill: గిల్ యాటిట్యూడ్‌ వల్లే ఓటమా? కైఫ్ వ్యాఖ్యలపై ఫ్యాన్స్‌ ఫైర్‌!
గిల్ యాటిట్యూడ్‌ వల్లే ఓటమా? కైఫ్ వ్యాఖ్యలపై ఫ్యాన్స్‌ ఫైర్‌!

Shubman Gill: గిల్ యాటిట్యూడ్‌ వల్లే ఓటమా? కైఫ్ వ్యాఖ్యలపై ఫ్యాన్స్‌ ఫైర్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 16, 2025
01:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో భారత్ 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆతిథ్య జట్టు నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు చేధించలేక 170 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లు అద్భుతంగా బంతులేసి విజయాన్ని దక్కించుకున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో భారత్‌ కెప్టెన్ శుభమన్ గిల్ యాటిట్యూడ్‌ వల్లే ఇంగ్లండ్‌ మరింత ఆత్మవిశ్వాసంతో ఆడిందని, గెలుపు వైపే మళ్లిందని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. 'జాక్ క్రాలీతో గిల్ వాగ్వాదం చేసిన క్షణం నుంచే ఇంగ్లండ్‌ పూర్తిగా గేర్‌లోకి వచ్చింది. ఎడ్జ్‌బాస్టన్ టెస్టు తర్వాత ఆ జట్టులో బ్యాటింగ్, బౌలింగ్, లీడర్‌షిప్‌పై అనేక సందేహాలు నెలకొన్నాయి.

Details

ఇంగ్లండ్ కు బాగా కలిసొచ్చింది

కానీ లార్డ్స్ టెస్టులో గిల్-క్రాలీ మాటల యుద్ధం జరిగిన వెంటనే బెన్ స్టోక్స్ దూకుడుగా బౌలింగ్‌తో మెరిపించాడు. అలా జట్టుకే ప్రేరణనిచ్చాడు. అటువంటి యాటిట్యూడ్‌ వాళ్లకు కలిసి వచ్చింది. తాను ప్రయోజకరంగా అనుకున్న వైఖరిని ఎంచుకుని దానికే కట్టుబడి ఉండడం తెలివైన పని. గిల్ తప్పక దీనిల్లోంచి నేర్చుకుంటాడని అని కైఫ్ తన పోస్టులో పేర్కొన్నాడు. అయితే కైఫ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. కొంతమంది అభిమానులు గిల్‌ను సమర్థించగా, మరికొంతమంది కైఫ్ మాటలకు మద్దతుగా నిలిచారు.

Details

గిల్ యాటిట్యూడ్ పై చర్చ

కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు ఇలా ఉన్నాయి. 'కైఫ్ భాయ్.. ఈ వ్యాఖ్యలతో మిమ్మల్ని చూసే విధానం మారిపోతోంది. గిల్ చేసింది తప్పే కాదు. క్రాలీ ఒక్క ఓవర్‌ కోసం ఏడు నిమిషాలు నష్టం చేశాడు. దానికి గిల్ బదులు చెప్పినంత మాత్రాన ఏమీ కాదు. ఇంగ్లాండ్ డిజర్వ్ చేసిన రీతిలోనే స్పందించారని కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి లార్డ్స్ టెస్టులో భారత్ ఓటమి తర్వాత గిల్ యాటిట్యూడ్ చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు మాంచెస్టర్ టెస్టులో గిల్ ఎలా స్పందిస్తాడో చూడాలి.