LOADING...
RCB vs GT: ఆ క్యాచ్ మ్యాచ్‌నే మార్చేసింది..తొలి ఓవర్లోనే షాక్
ఆ క్యాచ్ మ్యాచ్‌నే మార్చేసింది..తొలి ఓవర్లోనే షాక్

RCB vs GT: ఆ క్యాచ్ మ్యాచ్‌నే మార్చేసింది..తొలి ఓవర్లోనే షాక్

వ్రాసిన వారు Moogati Shabari
Apr 25, 2026
11:43 am

ఈ వార్తాకథనం ఏంటి

మొదటి ఓవర్‌లోనే భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఒకే ఒక్క క్యాచ్ డ్రాప్ మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది. ఐపీఎల్‌లో చిన్న పొరపాటు కూడా మ్యాచ్ దిశను పూర్తిగా మార్చగలదనే విషయం మరోసారి నిరూపితమైంది. నిన్న జరిగిన మ్యాచ్‌లో అలాంటి సంఘటనే కనిపించింది. విరాట్ కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ను వాషింగ్టన్ సుందర్ వదిలేయడంతో డకౌట్ చేసే అవకాశం చేజారిపోయింది. కోహ్లీ తర్వాత చెలరేగి 81 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.

వివరాలు

పాయింట్ల పట్టికలో దూసుకుపోతున్న ఆర్సీబీ..

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు గుజరాత్ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. శుక్రవారం ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో 206 పరుగుల లక్ష్యాన్ని ఆర్‌సీబీ విజయవంతంగా చేధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు సాయి సుదర్శన్ అద్భుత సెంచరీతో 20 ఓవర్లలో 205/3 భారీ స్కోరు నమోదు చేసింది. అయితే అతని శతకం జట్టుకు ఉపయోగపడలేదు. లక్ష్య ఛేదనలో ఆర్‌సీబీ తరఫున విరాట్ కోహ్లీ 81 పరుగులతో మెరిశాడు. దేవదత్ పడిక్కల్ 55 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి అద్భుత బ్యాటింగ్‌తో మ్యాచ్ పూర్తిగా ఆర్‌సీబీ వైపు మళ్లింది. ఈ విజయంతో ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.

వివరాలు

నిరాశతో సిరాజ్..

206 పరుగుల భారీ లక్ష్యాన్ని వెంటాడుతున్న సమయంలో ఆర్‌సీబీకి ఆరంభంలోనే పెద్ద షాక్ తగిలే పరిస్థితి ఏర్పడింది. మొదటి ఓవర్‌లోనే విరాట్ కోహ్లీని ఔట్ చేసే అవకాశాన్ని గుజరాత్ జట్టు కోల్పోయింది. మహమ్మద్ సిరాజ్ వేసిన తొలి ఓవర్‌లో ఒక లూప్ డెలివరీని కోహ్లీ సరిగా అంచనా వేయలేకపోయాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న వాషింగ్టన్ సుందర్ చేతుల్లోకి బంతి నేరుగా చేరింది. అది చాలా సులభమైన క్యాచ్ అయినప్పటికీ సుందర్ దాన్ని అందుకోలేక జారవిడిచాడు. దీంతో బౌలర్ సిరాజ్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. కోహ్లీని సున్నా పరుగులకే పెవిలియన్ పంపించి గుజరాత్‌కు ఆధిక్యం తీసుకురావాల్సిన అద్భుత అవకాశాన్ని సుందర్ కోల్పోయాడు. ఆ ఒక్క తప్పిదమే మ్యాచ్‌ను పూర్తిగా ఆర్‌సీబీ వైపు తిప్పేసింది.

Advertisement