Rishabh Pant: అంచనాలను అందుకోలేకపోయాం.. క్షమించండి : రిషబ్ పంత్
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో భారత జట్టు పేలవ ప్రదర్శనకు టీమిండియా వైస్‌కెప్టెన్ రిషబ్ పంత్ క్షమాపణలు తెలిపారు. గిల్ గైర్హాజరీలో నాయకత్వం చేపట్టిన పంత్, భారత్ 0-2తో సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో 'ఎక్స్'లో తన భావాలను వ్యక్తం చేశాడు. గత రెండు వారాల్లో మేం ఆశించిన స్థాయి ప్రదర్శన చేయలేకపోవడం నిజం. ఎల్లప్పుడూ అత్యుత్తమ క్రికెట్ ఆడుతూ, కోట్లాది భారతీయ అభిమానులను ఆనందపరచాలని మా కోరిక అని పంత్ పేర్కొన్నాడు. 'ఈసారి అంచనాలను అందుకోలేకపోయినందుకు మమ్మల్ని క్షమించాలి. కానీ ఈ ఆట వ్యక్తిగతంగా, జట్టుగా ఎదగడం ఎలా అనేది నేర్పుతుంది. మా జట్టు సామర్థ్యంపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది.
Details
తప్పులను సరిదిద్దుకుంటాం
తప్పులను సరిచేసుకుని, మరింత శక్తితో తిరిగి పుంజుకుంటామని అన్నాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎంతో గొప్ప గౌరవమని కూడా పంత్ పేర్కొన్నాడు. ఇదే విషయంపై గాయంతో సిరీస్‌కు దూరమైన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా స్పందించాడు. 'సాంత్వనభరితమైన సముద్రాలు ప్రయాణాన్ని నేర్పవు. తుపానులే మన చేతులను మరింత బలంగా మారుస్తాయి. మేం ఒకరిని ఒకరం నమ్ముకుంటాం. ఒకరి కోసం ఒకరు పోరాడుతూ ముందుకు సాగుతాం. మరింత దృఢంగా తిరిగి లేస్తామని గిల్ తన పోస్టులో చెప్పాడు.