Page Loader
IPL 2025: మాకు అన్యాయం జరిగింది... ఐపీఎల్ అధికారులపై మండిపడ్డ కోల్‌కతా
మాకు అన్యాయం జరిగింది... ఐపీఎల్ అధికారులపై మండిపడ్డ కోల్‌కతా

IPL 2025: మాకు అన్యాయం జరిగింది... ఐపీఎల్ అధికారులపై మండిపడ్డ కోల్‌కతా

వ్రాసిన వారు Jayachandra Akuri
May 21, 2025
05:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్లే ఆఫ్స్ నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు అదనపు గంట సమయం కేటాయించిన విషయం తెలిసిందే. వర్షం వల్ల కీలకమైన మ్యాచ్‌లు రద్దుకాకుండా ఉండేందుకే బీసీసీఐ ఈ కొత్త నిబంధన తీసుకొచ్చింది. అయితే ఈ నిర్ణయం ఆలస్యంగా తీసుకున్నందుపైన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐపీఎల్ పునఃప్రారంభం సమయంలోనే ఈ మార్పు ఎందుకు చేయలేకపోయారని కోల్‌కతా సీఈఓ వెంకీ మైసూర్ ప్రశ్నించారు. ఈ అంశంపై ఐపీఎల్ సీఓఓ హేమంగ్ అమిన్‌కు వెంకీ మైసూర్ ఈమెయిల్ పంపారు. "నిబంధనల మార్పు సమయానికి తీసుకురావాల్సింది. సీజన్ మధ్యలో మార్పులు అవసరమవచ్చు కానీ స్థిరత్వం అవసరమని ఆయన పేర్కొన్నారు.

Details

ఆర్సీబీ-కోల్‌కతా మ్యాచ్ రద్దు 

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ మే 17 నుంచి తిరిగి ప్రారంభమైంది. అదే రోజు కోల్‌కతా, ఆర్సీబీ మధ్య చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. వర్షం తీవ్రతతో టాస్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. కనీసం ఐదు ఓవర్లు కూడా జరగలేదని పేర్కొన్న వెంకీ.. అప్పుడే అదనపు గంట సమయం ఉండే నిబంధన అమలులో ఉండి ఉంటే, మ్యాచ్ పూర్తికావచ్చుందని అభిప్రాయపడ్డారు.

Details

ఎక్స్‌ట్రా టైమ్ నిర్ణయం ఆలస్యమా?

మే 15నుంచి వర్ష సూచన ఉందని తెలిసినప్పటికీ బీసీసీఐ ముందస్తుగా స్పందించలేదు. మా మ్యాచ్ ఆర్సీబీతో ప్లే ఆఫ్స్‌ రేసులో కీలకమైనది. వర్షం కారణంగా అది రద్దయ్యింది. మే 20 నుంచి ఎక్స్‌ట్రా టైమ్ అమలులోకి తెచ్చారు. అదే ముందే అమలు చేసినా మా నష్టం తలాలేదేమో" అంటూ వెంకీ అసహనం వ్యక్తం చేశారు.

Details

ఇతర జట్ల నుంచి కూడా వ్యతిరేకత

కేవలం కోల్‌కతా మాత్రమే కాకుండా, మరికొన్ని జట్లు కూడా ఈ సీజన్ మధ్యలో తీసుకొచ్చిన నిబంధనల మార్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ వివాదం నేపథ్యంలో నిబంధనలపై స్పష్టత, సమచిత సమయాన నిర్ణయాలపై బీసీసీఐపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కోల్‌కతా జట్టు తమ చివరి లీగ్ మ్యాచ్‌లో మే 25న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఎదుర్కోనుంది. ప్లే ఆఫ్స్ ఆశలు ముగిసినప్పటికీ.. ఈ వివాదం మరికొన్ని రోజులు చర్చనీయాంశంగా ఉండేలా కనిపిస్తోంది.