Harman Preet Kaur: మరింత బలంగా తిరిగొస్తాం.. నెక్ట్స్ మ్యాచులో అదరగొడతాం: హర్మన్ ప్రీత్ కౌర్
ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్ మహిళల జట్టుతో జరిగిన తొలి టీ20ల్లో ఇంగ్లండ్ మహిళల జట్టు విజయం సాధించింది. 38 పరుగుల తేడాతో హర్మన్‌ప్రీత్ కౌర్ సేనను చిత్తు చేసింది. తద్వారా మూడు మ్యాచులో సిరీస్‌లో ఇంగ్లండ్ మహిళల జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో భారత్ కేవలం 159 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ ఓటమిపై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(Harman Preet Kaur) స్పందించింది. తమ ఆటగాళ్లు తప్పుల నుంచి నేర్చుకునేందుకు ఈ మ్యాచ్ దోహదపడతుందని పేర్కొంది. ఇంగ్లిష్ జట్టుకు మంచి బ్యాటింగ్ లైనప్ ఉందని ఆమె ప్రశంసించింది.
డిసెంబర్ 9న రెండో వన్డే
చివరి పది ఓవర్లు సరిగ్గా సాగలేదని, తదుపరి మ్యాచుల్లో విజయానికి కృషి చేస్తామని హార్మన్ వెల్లడించారు. మ్యాచ్ విషయానికొస్తే భారత్ తరుపున రేణుకా సింగ్ మూడు వికెట్లు తీయగా, శ్రేయాంక పాటిల్ రెండు వికెట్లు పడగొట్టింది. బ్యాటర్లలో షఫాలీ వర్మ 42 బంతుల్లో 52 పరుగులు చేసి ఫర్వాలేదనిపించింది. రెండో మ్యాచ్ డిసెంబర్ 9న, మూడో మ్యాచ్ డిసెంబర్ 10న జరగనుంది. ఈ రెండు మ్యాచ్‌లు కూడా ముంబైలోని వాంఖడే స్టేడియంలోనే జరగనున్నాయి.