
Arshdeep Singh: వీకెండ్ క్రికెట్ హీరో.. ప్రతి మ్యాచ్ తర్వాత వారు నాకు ఆడిన స్టాటిస్టిక్స్ పంపేవారు: అర్ష్‌దీప్
ఈ వార్తాకథనం ఏంటి
భారత జట్టు తరపున టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా అర్ష్‌దీప్ సింగ్ కొనసాగుతున్నాడు. అదేవిధంగా, టీమిండియా తరఫున 100కు పైగా వికెట్లు సాధించిన ఏకైక బౌలర్‌గా కూడా అతడు ప్రత్యేక గుర్తింపు పొందాడు. మరి అలాంటి పేసర్‌కు కన్నతండ్రి నుంచే సవాళ్లు ఎదరయ్యాయంటే నమ్మగలరా? అవును.. స్వయంగా అర్ష్‌దీప్ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పాడు. ఈ సవాళ్లు కేవలం ఆట పరిధిలోనే ఉండడం విశేషం. ఎందుకంటే అతని తండ్రి, దర్శన్ సింగ్ కూడా క్రికెట్ ఆడేవారు. అయితే, ఆయన కార్పొరేట్ లెవల్‌లో ఆడేవారు. వీకెండ్స్‌లో ఎక్కువగా మ్యాచులు ఆడేవారని అర్ష్‌దీప్ తెలిపాడు.
వివరాలు
ప్రతి మ్యాచ్ తర్వాత వారు నాకు ఆడిన స్టాటిస్టిక్స్ పంపేవారు
"నేను బాగా ఆడినప్పుడు మా నాన్న మరీ ఎక్కువగా దాని గురించి చర్చించరు. కానీ వారు వీకెండ్స్‌లో కార్పొరేట్ క్రికెట్ ఆడేవారు. శనివారం, ఆదివారం మైదానంలో ఉండేవారు. అవుట్ స్వింగర్లతో ప్రత్యర్థులను ఇబ్బందిపెట్టేవారు. ప్రతి మ్యాచ్ తర్వాత వారు నాకు ఆడిన స్టాటిస్టిక్స్ పంపేవారు. 'ఈ రోజు నాలుగు ఓవర్లు వేశాను, రెండు వికెట్లు తీసి 19 పరుగులు ఇచ్చాను. నిన్నటి కన్నా బాగా బౌలింగ్ చేయి' అని ప్రోత్సహించేవారు.ఇది నాకు ఒక రకమైన ఒత్తిడిని కలిగించేది" అని అర్ష్‌దీప్ గుర్తు చేసుకున్నారు.
వివరాలు
80% ప్రాక్టీస్ చేస్తే..
అయితే,అంతర్జాతీయ క్రికెట్‌లో ఉండే గేమ్ స్టైల్, కార్పొరేట్ క్రికెట్ వేరు. నేను ఒక క్రికెటర్‌గా మెరుగ్గా మారేందుకు కారణం మాత్రం మా నాన్నే. అయన ఎల్లప్పుడూ ప్రోత్సహించారు. 80% ప్రాక్టీస్ చేస్తే, మ్యాచ్ సమయంలో అందులో కేవలం సగం మాత్రమే కనిపిస్తుంది. అందువల్ల నెట్ ప్రాక్టీస్‌లో ఎక్కువ శ్రద్ధ పెట్టాలి' అని చెబుతుంటారు. ప్రతి మ్యాచ్ తరువాత, నా కోచ్‌తో పాటు కుటుంబ సభ్యుల నుంచి సందేశాలు వస్తుంటాయి. వాటిలో బౌలింగ్ విధానంపై ప్రత్యేక సూచనలు ఉంటాయి" అని తెలిపారు.
వివరాలు
బుమ్రా వల్లే..
"బుమ్రాను చూడటం వల్లనే నేను యార్కర్లను వేయడం అలవాటు చేసుకున్నాను. యార్కర్ వేయడం వల్ల బ్యాటర్‌కు ఎక్కువ ఇబ్బంది కలుగుతుంది. ఆ ఖచ్చితత్వాన్ని బుమ్రా చూపిస్తారు. ఎడమ చేతివాటం బౌలర్ల వీడియోలను నేను సవివరంగా పరిశీలించాను. ఏ స్టార్ పేసర్ వీడియో అయినా మిస్ చేయను. వసీమ్ అక్తర్ వేసే యార్కర్ల తీరు కూడా చాలా ప్రేరణనిస్తుందని భావిస్తాను. బ్యాటర్ మీద ఆధారపడి ఇన్‌స్వింగర్, అవుట్ స్వింగర్ వేసే కళలో ఆయన ప్రావీణ్యం కలవాడు. ఆ నైపుణ్యం నాకు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే జహీర్ ఖాన్ రివర్స్ స్వింగ్ బౌలింగ్ చాలా ప్రభావవంతంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను" అని అర్ష్‌దీప్ పేర్కొన్నారు.