వెస్టిండీస్ జట్టు కోచ్‌గా ఆ జట్టు మాజీ కెప్టెన్.. ఎవరంటే!
వన్డే వరల్డ్ కప్ 2023 క్వాలిఫియర్స్ కు ముందు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. జింబాబ్వే వేదికగా వన్డే వరల్డ్ క్యాలిఫియర్స్ ను వెస్టిండీస్ ఆడనుంది. ఈ క్రమంలో విండీస్ అసిస్టెంట్ కోచ్ గా ఆ జట్టు మాజీ కెప్టెన్ కార్ల్ హూపర్ నియామకం అయ్యాడు. ఈ విషయాన్ని విండీస్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో ధ్రువీకరించింది. హూపర్ ప్రస్తుతం కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో గత కొన్ని సీజన్ లగా గయానా అమెజాన్ వారియర్స్ కోచింగ్ స్టాప్ లో కూడా భాగంగా ఉన్నాడు. ఇక విండీస్ తరుపున మాజీ కెప్టెన్ హూపర్ 5వేల పరుగులు చేశాడు.
వన్డే వరల్డ్ కప్ అర్హత సాధించడానికి విండీస్ ప్రయత్నం
అదే విధంగా హూపర్ విండీస్ తరుపున 100 వికెట్లు సాధించిన రికార్డు ఆయన పేరు మీద ఉంది. దాదాపు 15 ఏళ్లు పాటు విండీస్ జట్టుకు హూపర్ సేవలు అందించిన విషయం తెలిసిందే. ఇక ఐసీసీ వన్డే సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో టాప్-8లో విండీస్ జట్టు లేకపోవడంతో ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచ కప్ కు నేరుగా అర్హత సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో హోప్ సారథ్యంలో విండీస్ క్వాలిఫియర్స్ మ్యాచులు ఆడనుంది. ఈ రెండు మ్యాచులు జూన్ 18 నుంచి జింబాబ్వే వేదికగా జరగనున్నాయి. ఇందులో మొత్తం 10 జట్లు పాల్గొనున్నాయి. వీటిలో రెండు జట్లు మాత్రమే ప్రపంచ కప్ కు అర్హత సాధిస్తాయి.