భారత్‌తో టెస్టు సిరీస్‌కు విండీస్ జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు అరంగ్రేటం
టీమిండియాతో టెస్టు సిరీస్ నేపథ్యంలో విండీస్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. జూలై 12నుంచి మొదలు కానున్న తొలి టెస్టు కోసం 13 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. కెప్టెన్‌గా బ్రాత్‌వైట్ వ్యవహరిస్తుండగా.. వైస్ కెప్టెన్‌గా జెర్మైన్ బ్లాక్ వుడ్ ఎంపికయ్యాడు. ఇద్దరు లెప్టాంట్ బ్యాటర్లు తొలిసారిగా వెస్టిండీస్ టెస్టు జట్టులో స్థానం సంపాదించుకోగా.. ఒక స్పిన్నర్ రీఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో రాణించిన అలిక్అథనాజ్, కిర్క్ మెకంజీ విండీస్ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 30మ్యాచులు ఆడిన అథనాజ్ 1825 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలున్నాయి. ఇక మెకంజీ తొమ్మిది మ్యాచులు ఆడి 591రన్స్ చేశారు. ఇందులో ఒక సెంచరీ ఉంది.
టెస్టు జట్టులోకి కార్నివాల్ రీ ఎంట్రీ
ఇటీవల జట్టులో స్థానం కోల్పోయిన విండీస్ బ్యాటర్ రకీం కార్న్‌వాల్ రి-ఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు లెఫ్టార్మ్ స్పిన్నర్ గుడకేశ్ మోటీ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇటీవల బంగ్లాదేశ్ ఎ జట్టులో మెకెంజీ, అథానాజ్ అత్యత్తుమ ప్రదర్శనతో అకట్టుకున్నారని, వారికి టెస్టుల్లో ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని హేన్స్ చెప్పాడు. వెస్టిండీస్ జట్టు: క్రెగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (వైస్ కెప్టెన్), అలిక్ అథనాజ్, తగ్‌నరన్ చందర్‌పాల్, రకీం కార్న్‌వాల్, జాషువా డా సిల్వా, షానన్ గాబ్రియేల్, జేసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, కిర్క్ మెకంజీ, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జోమెల్ వారికాన్.