సన్ రైజర్స్ ఆటగాళ్ల బలాబలాలపై ఓ లుక్కేయండి..!
ఈ వార్తాకథనం ఏంటి
గత ఐపీఎల్ సీజన్‌లో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఈసారి వేలంలో కొందరు కీలకమైన ఆటగాళ్లను తీసుకొని కాస్త పటిష్టంగా కనిసిప్తోంది.
ముఖ్యంగా మయాంక్ అగర్వాల్ రూ.8.25 కోట్లు, హార్డ్ హిట్టర్ హ్యారీ బ్రూక్ రూ.13.25 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం ద్వారా మిడిల్ ఆర్డర్ ను బలపరుచుకుంది.
రాహుల్ త్రిపాఠి, క్లాసెన్, అబ్దుల్ సమద్ లాంటి హిట్టర్లతో పాటు కెప్టెన్ ఏడెన్ మార్‌క్రమ్ బ్యాటింగ్‌లో కీలక పాత్ర పోషించనున్నారు.
ఇక ఆల్ రౌండర్ వాష్టింగన్ సుందర్ జట్టుకు అదనపు బలం. దీంతో నెంబర్ 8 వరకూ సన్ రైజర్స్ బ్యాటింగ్ బలంగా ఉందని చెప్పొచ్చు.
వికెట్ కీపర్లు: గ్లెన్ ఫిలిప్స్, నితీష్ కుమార్ రెడ్డి, ఉపేంద్రసింగ్ యాదవ్, హెన్రిచ్ క్లాసెన్
సన్ రైజర్స్
ఆల్ రౌండర్లపై భారీ ఆశలు పెట్టుకున్న సన్ రైజర్స్
బ్యాటర్స్: అబ్దుల్ సమద్, మార్క్రామ్, రాహుల్ త్రిపాఠి, అన్మోల్‌ప్రీత్ సింగ్, మయాంక్ అగర్వాల్, హ్యారీబ్రూక్
ఆల్ రౌండర్లు: అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, మయాంక్ దాగర్, సన్వీర్ సింగ్, సమర్థ్ వ్యాస్, వివ్రాంత్ శర్మ.
బౌలర్లు: ఫజల్హాక్ ఫరూఖీ, మార్కో జాన్సెన్, కార్తీక్ త్యాగి, భువేశ్వర్ కుమార్, T. నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, , మయాంక్ మార్కండే, ఆదిల్ రషీద్
సన్ రైజర్స్ ఈసారి కొందరు ప్లేయర్స్‌పై భారీ ఆశలను పెట్టుకుంది. ఏడెన్ మార్‌క్రమ్ కెప్టెన్ గానే కాదు బ్యాటింగ్, బౌలింగ్ లలోనూ రాణించే అవకాశం ఉంది. హ్యారీబ్రూక్ ఈసారి సన్ రైజర్స్‌కు అతి పెద్ద బలం. సౌతాఫ్రికా బ్యాటర్ క్లాసెన్ కూడా మంచి ఫామ్‌లో ఉండడం సన్ రైజర్స్‌కు కలిసొచ్చే అంశం