టీమిండియాలో చోటు దక్కాలంటే యోయో, డెస్కా పరీక్షలు పాస్ అవ్వాల్సిందే..
టీమిండియా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై కొన్ని నెలలుగా చాలా అనుమానాలున్నాయి. గాయాలు కారణంగా బరిలోకి దిగితే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పటికే అందరికీ యోయో పరీక్షలంటే తెలుసు. దీనికి తోడు డెక్సా స్కాన్‌ను కూడా పరిగణలోకి తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. DEXA అంటే డ్యూయల్ ఎనర్జీ ఎక్స్-రే అబ్సార్ప్టియోమెట్రీ. ఇది ఎముకలో కాల్షియం, ఇతర మినరల్స్ ఎంత శాతం ఉంటాయో గుర్తించవచ్చు. దీన్ని ఎమ్మారై కంటే తక్కువ రేడియేషన్లో వినియోగిస్తారు. దీనిలో సెంట్రల్ డెక్సా, పెరిఫెరల్ డెస్కా స్కాన్ అనే రెండు రకాలుగా ఉంటాయి. గాయాల కారణంగా జస్పిత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌కు, గతేడాది రోహిత్ శర్మ ఐదు టెస్టులకు దూరమైన విషయం తెలిసిందే.
టెస్టులు పాసైతేనే వరల్డ్ కప్‌లో చోటు
కొన్ని సంవత్సరాల క్రితం భారత ప్లేయర్లకు యో-యో టెస్టు కీలకంగా మారింది. ఇది ఏరోబిక్ ఎండ్యూరెన్స్ ఫిట్‌నెస్ టెస్ట్. దీని కోసం 20 మీటర్లు మధ్య నుంచి మార్కర్ల మధ్య పరిగెత్తాల్సి ఉంది. ఇందుకోసం చాలా ఓపిక, ఓర్పు అవసరం. ఈ టెస్ట్‌లో విఫలమైన చాలామంది ఆటగాళ్లను జట్టును తొలగించారు. జట్టులో ఎంపిక కోసం ఆటగాళ్లు యో-యో టెస్ట్ క్లియర్ చేయాల్సి ఉంటుందని బీసీసీఐ కార్యదర్శి జే షా ధ్రువీకరించారు.ప్రస్తుతం యోయో టెస్టు, డెక్సా రెండింటిని పరిగణలోకి తీసుకోనున్నారు. దీంతో ఆటగాళ్ల సామర్థ్యం తెలియనుంది. వన్డే ప్రపంచకప్‌కు 20 మంది ఆటగాళ్లు షార్ట్‌లిస్ట్ చేయడం గమనార్హం. ఈ టెస్టులో పాసైతేనే వారికి వన్డే వరల్డ్ కప్ లో చోటు దక్కే అవకాశం ఉండనుంది.