Page Loader
PickleBall Game: 'పికిల్‌బాల్ గేమ్' అంటే ఏమిటి?రూల్స్ ఎలా ఉంటాయి? 
'పికిల్‌బాల్ గేమ్' అంటే ఏమిటి?రూల్స్ ఎలా ఉంటాయి?

PickleBall Game: 'పికిల్‌బాల్ గేమ్' అంటే ఏమిటి?రూల్స్ ఎలా ఉంటాయి? 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 21, 2024
09:57 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలో పికిల్‌బాల్ ట్రెండ్ పెరుగుతోంది.అమెరికాలో మొదలైన పికిల్‌బాల్ ట్రెండ్ ఇప్పుడు ప్రపంచంలోని 70 దేశాలకు చేరుకుంది. పికిల్‌బాల్ అనేది టెన్నిస్,టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్‌ను పోలి ఉంటుందీ పికిల్‌బాల్‌ గేమ్‌. ప్రపంచవ్యాప్తంగా దాని ఆటగాళ్ల సంఖ్య పెరుగుతున్నందున,దానిని ఒలింపిక్స్‌లో చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2028లో జరిగే ఒలింపిక్ క్రీడల్లో పికిల్‌బాల్‌ను చేర్చవచ్చని క్రీడా నిర్వాహకులు పేర్కొన్నారు. గార్డియన్ నివేదిక ప్రకారం, పికిల్‌బాల్ 1965లో ప్రారంభమైంది.వాషింగ్టన్‌కు చెందిన ముగ్గురు పెద్దలు కలిసి దాని పునాది వేశారు. వారు ఈ ఆటను బ్యాడ్మింటన్ కోర్ట్ లో ప్రారంభించారు. ఈ విభిన్నమైన ఆటను ప్లాస్టిక్ బాల్,రంధ్రాలతో కూడిన రాకెట్‌తో ఆడేవారు.ఈ ఆట ప్రారంభించిన పెద్దాయన కుక్క పేరు 'పికిల్స్'. అందుకే ఈ ఆటకు పికిల్‌బాల్ అని పేరు పెట్టారు.

వివరాలు 

ఇండియాలో ఈ గేమ్ ఎప్పుడు ప్రారంభం అయ్యిందో తెలుసా

ఈ గేమ్ ప్రపంచంలోని 70 దేశాలకు చేరుకుంది. ఇండియాలో కూడా ఈ గేమ్ ఆడటం మొదలైంది. 2006లో కెనడా నుంచి తిరిగి వచ్చిన సునీల్ వాల్వాకర్ ముంబైకి చేరుకున్నప్పుడు ఈ గేమ్ దేశానికి చేరుకుంది. అతను పికిల్‌బాల్‌లో ఉపయోగించే కొన్ని రాకెట్‌లు, బాల్స్‌ని తన వెంట తెచ్చుకున్నాడు. పికిల్‌బాల్ కోసం 1967లో మొదటిసారిగా పర్మనెంట్ కోర్టు నిర్మించారు. ఈ గేమ్‌ను ప్రస్తుతం 48 లక్షల మంది ఆడుతున్నారు. గత 5 సంవత్సరాలలో, పికిల్‌బాల్ ఆడే వారి సంఖ్య రెట్టింపు అయ్యింది. పికిల్‌బాల్‌ గేమ్‌ కోర్టు మొత్తం 44 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు ఉంటుంది. టెన్నిస్‌ కోర్టు లాగానే ఇక్కడ కొన్ని నిబంధనలు ఉంటాయి.

వివరాలు 

పికిల్‌బాల్ రూల్స్ ఇవీ.. 

నెట్‌ ఎత్తు కేవలం 36 అంగుళాలు మాత్రమే ఉంటుంది. టెన్నిస్‌లో రెండు ఫాల్ట్‌లు చేస్తే సర్వీస్‌ పోతుంది.. కానీ పికిల్‌బాల్‌లో కేవలం ఒక్క ఫాల్ట్‌ మాత్రమే ఉంటుంది. డబుల్స్‌లో ఒకసారే సర్వ్‌ చేసే అవకాశం ఉంటుంది.ఆట మొదలైన సమయంలో కనీసం ఒక్కసారైనా బంతి నేలపై బౌన్స్‌ అయినప్పుడే షాట్‌ కొట్టాలి.ఆ తర్వాత నేరుగా బంతిని కొట్టచ్చు. టెన్నిస్‌లో ఎవరు సర్వ్‌ చేసినా పోయినప్పుడు ప్రత్యర్థికి పాయింట్‌ ఇస్తారు.కానీ,పికిల్‌బాల్‌ గేమ్‌లో మాత్రం సర్వ్‌ చేసినప్పుడే పాయింట్లు వస్తాయి. ప్రతి సెట్‌ 11 పాయింట్లకు ముగుస్తుంది. రెండు పాయింట్ల తేడాతో విజేతను ప్రకటిస్తారు. టెన్నిస్‌లో ఉన్నట్లే సర్వ్‌ చేసినప్పుడు లేదా గేమ్‌లో భాగంగా నెట్‌ను దాటిపోవాలి.సర్వ్‌ సమయంలో 'నో వ్యాలీ జోన్‌' వద్ద బంతిని అందుకోకూడదు.