LOADING...
Ind vs SA: మూడో వన్డేలో రాహుల్ స్ట్రాటజీ ఏమిటి? ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఏమైనా మార్పులుంటాయా?
మూడో వన్డేలో రాహుల్ స్ట్రాటజీ ఏమిటి? ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఏమైనా మార్పులుంటాయా?

Ind vs SA: మూడో వన్డేలో రాహుల్ స్ట్రాటజీ ఏమిటి? ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఏమైనా మార్పులుంటాయా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 06, 2025
08:59 am

ఈ వార్తాకథనం ఏంటి

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగబోయే నిర్ణయాత్మక మూడో వన్డే డిసెంబర్ 6వ తేదీ శనివారం విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ప్రారంభం కానుంది. సిరీస్‌లో ఇరు జట్లు తలా ఒక మ్యాచ్ గెలుపొందడంతో, ఈ మ్యాచ్‌ ఫలితం ఎవరు సిరీస్‌ను కైవసం చేసుకుంటారో నిర్ణయించనుంది. రాంచీలో జరిగిన తొలి వన్డేలో భారత్‌ 17 పరుగుల తేడాతో గెలిస్తే, రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కీలకమైన మూడో వన్డే నేడు మధ్యాహ్నం 1:30 గంటలకు ఆరంభం అవుతుంది.

Details

 భారత్ ప్లేయింగ్ ఎలెవెన్‌లో మార్పులేదా?

అభిమానులు భారత్ చివరి మ్యాచ్‌లో ఎలాంటి ప్లేయింగ్ ఎలెవెన్‌ను ప్రకటిస్తుందా అన్న దానిపై ఆసక్తిగా ఉన్నారు. రాయ్‌పూర్ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ, కెప్టెన్ కేఎల్ రాహుల్ ఈ కీలక పోరుకు జట్టులో మార్పులు చేసే సూచనలు కనిపించడం లేదు. నితీష్ కుమార్ రెడ్డి, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, తిలక్ వర్మ ఈ మ్యాచ్‌లో కూడా బెంచ్‌లోనే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వరుసగా రెండు శతకాలు బాదిన విరాట్ కోహ్లీ మరోసారి అద్భుత ప్రదర్శన చూపేందుకు సిద్ధంగా ఉన్నాడు. రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్ కూడా బ్యాటింగ్‌లో ప్రభావం చూపేందుకు ఉత్సాహంగా ఉన్నారు. గత మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన రుతురాజ్ గైక్వాడ్ శతకం నమోదు చేశాడు.

Details

దక్షిణాఫ్రికా జట్టులో మార్పులు అనివార్యం

అతని ఇన్నింగ్స్ క్లాసిక్ షాట్స్, నియంత్రిత ఆటతీరు, మొత్తంగా కోహ్లీ స్టైల్‌ను గుర్తు చేసింది. రాయ్‌పూర్ వన్డేలో ప్రసిద్ధ్ కృష్ణ 85 పరుగులు ఇచ్చినప్పటికీ, భారత జట్టులో స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్ లేకపోవడం వల్ల అతన్ని తప్పించి ఆల్ రౌండర్‌ను తీసుకునే అవకాశం కనిపించడం లేదు. రాయ్‌పూర్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ టోనీ డి జోర్జీ, ఫాస్ట్ బౌలర్ నండ్రే బర్గర్ ఇద్దరూ స్నాయువు, కండరాల గాయాలతో మైదానం విడిచిపెట్టాల్సి వచ్చింది. ఈరకమైన గాయాలు త్వరగా నయం కావు కాబట్టి, వైజాగ్ వన్డేకు ఈ ఇద్దరూ అందుబాటులో ఉండకపోవడం దాదాపు ఖాయమైంది. అందువల్ల బర్గర్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ ఓట్నీల్ బార్ట్‌మాన్,జోర్జీ స్థానంలో ర్యాన్ రికెల్టన్ జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది.

Advertisement