Page Loader
U16 Davis Cup: క్రీడా స్ఫూర్తి ఎక్కడ..? ఓటమి సహించలేక అసభ్యంగా ప్రవర్తించిన పాక్ ప్లేయర్!
క్రీడా స్ఫూర్తి ఎక్కడ..? ఓటమి సహించలేక అసభ్యంగా ప్రవర్తించిన పాక్ ప్లేయర్!

U16 Davis Cup: క్రీడా స్ఫూర్తి ఎక్కడ..? ఓటమి సహించలేక అసభ్యంగా ప్రవర్తించిన పాక్ ప్లేయర్!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 28, 2025
01:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

అండర్-16 డేవిస్ కప్‌లో భారత్ చేతిలో ఓటమి పాలైన పాకిస్థాన్ ఆటగాడి అసభ్య ప్రవర్తన వీడియో తాజాగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఆసియా-ఓషేనియా జూనియర్ డేవిస్ కప్ (U-16) టోర్నమెంట్‌లో భాగంగా జరిగిన 11వ స్థానం కోసం జరిగిన ప్లేఆఫ్ మ్యాచ్‌లో భారత జట్టు 2-0తో పాకిస్తాన్‌ను ఓడించింది. ఈ మ్యాచ్ శనివారం (మే 25) న జరిగింది. భారత తరఫున ప్రాకాష్ సారన్, తవిష్ పహ్వా తమ సింగిల్స్ మ్యాచ్‌లను స్ట్రెయిట్ సెట్లలో గెలిచారు. వారి అద్భుత ప్రదర్శనతో భారత జట్టు పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. అయితే మ్యాచ్ ముగిసిన మూడు రోజుల తర్వాత పాకిస్తాన్ ఆటగాడి ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Details

తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు

ఒక్కసారి కాదు, పునరావృతంగా భారత ఆటగాడిని తక్కువ చేసే విధంగా అతని ప్రవర్తన కనిపించింది. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిన ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆటలో ఓటమిని సాదాసీదాగా అంగీకరించలేకపోయినట్టు ఈ వీడియోలో తెలుస్తోంది. ఇకపోతే వీడియోను చూసిన పలువురు భారత నెటిజన్లు భారత ఆటగాడి ప్రవర్తనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎంతగా స్పందిస్తూ ప్రవర్తించినా అతను ప్రశాంతంగా, గౌరవంగా స్పందించాడని పేర్కొన్నారు. నిజమైన ఆటగాడికి ఉండాల్సిన నైతిక విలువలు అతనిలో ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అంతకుముందు, 9-12 స్థానాల కోసం భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 1-2తో ఓడింది. డబుల్స్ మ్యాచ్ హై వోల్టేజ్ పోరుతో సాగగా, చివరికి సూపర్ టై బ్రేక్‌లో భారత్ 9-11తో ఓడిపోయింది.