T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్ సెమీఫైనల్స్ కి ఏ జట్లు వస్తాయంటే?
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్ కు సమయం ఆసన్నమవుతోంది. భారత్,శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీ కోసం అభిమానుల్లో భారీ ఉత్సాహం కనిపిస్తుంది. టోర్నీ ప్రారంభానికి ఇంకా కొద్దీ సమయమే ఉన్నప్పటికీ, సెమీఫైనల్ దశకు చేరే జట్లపై మాజీ క్రికెటర్లు, నిపుణులు తమ అంచనాలను వ్యక్తం చేశారు. భారత్ క్రికెట్ దిగ్గజాలు అనిల్ కుంబ్లే, ఇర్ఫాన్ పఠాన్, సురేశ్ రైనా సహా పలు మాజీ ఆటగాళ్లు సెమీఫైనల్స్‌కు వెళ్లే జట్లను అంచనా వేశారు. ఆసక్తికరంగా ప్రతి మాజీ ఆటగాడు టీమిండియా సెమీ ఫైనల్ చేరుకుంటుందని అభిప్రాయపడ్డారు.
వివరాలు
ఈ నాలుగు జట్లు సెమీ ఫైనల్ దశకు చేరుతాయి: అనిల్ కుంబ్లే
మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే తన అంచనాల్లో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లను సెమీఫైనలిస్టులుగా పేర్కొన్నారు. అనుభవం, సమతుల్య జట్టు కలయిక ఉన్న ఈ నాలుగు జట్లు సెమీ ఫైనల్ దశకు చేరుతాయని అభిప్రాయపడ్డారు. అలాగే సంజయ్ బంగర్, చేటేశ్వర పుజారా, ఆకాశ్ చోప్రా కూడా ఇదే నాలుగు జట్లకు మద్దతు తెలిపారు. ఇర్ఫాన్ పఠాన్ మాత్రం సెమీఫైనల్ జట్లలో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో పాటు పాకిస్తాన్ జట్టును కూడా చేర్చారు. ఐసీసీ టోర్నీల్లో పాకిస్తాన్ అనూహ్య ప్రదర్శన చేయగల సామర్థ్యం కలిగి ఉండటమే ఇర్ఫాన్ ఎంపికకు కారణంగా తెలుస్తోంది.
వివరాలు
రైనా అంచనాల్లో ప్రత్యేక ఆకర్షణ శ్రీలంక
మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా తన జాబితాలో భారత్,దక్షిణాఫ్రికా,న్యూజిలాండ్,శ్రీలంక జట్లను చేర్చారు. శ్రీలంకను సెమీఫైనల్ రేసులోకి తీసుకురావడం రైనా అంచనాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహమ్మద్ కైఫ్,రాబిన్ ఉతప్పల వంటి ఇతర మాజీ ఆటగాళ్ల అంచనాల ప్రకారం కూడా భారత్, దక్షిణాఫ్రికా,న్యూజిలాండ్,ఇంగ్లండ్ జట్లకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి, దాదాపు అన్ని మాజీ ఆటగాళ్ల అంచనాల్లో టీమిండియా ఉండడం స్పష్టంగా కనిపిస్తుంది. ఆస్ట్రేలియా,ఇంగ్లండ్,న్యూజిలాండ్ జట్లు కూడా సెమీస్ చేరతాయని వారు చెప్పారు. పాకిస్తాన్,దక్షిణాఫ్రికా,శ్రీలంక జట్లు కూడా పోటీలో ఉంటాయని మాజీ క్రికెటర్లు అంచనా వేశారు. తుది ఫలితాలు మాజీల అంచనాలకు తగినట్టే ఉంటాయా?లేక టీ20 వరల్డ్‌కప్‌లో మరోసారి అనూహ్య ఫలితాలు చూస్తామా? అది ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే టోర్నీ సమయంలోనే తెలుస్తుంది.