NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Harvinder Singh: హర్విందర్ సింగ్ గురించి మీకు తెలుసా? ఎందుకు ఆయనకు పద్మశ్రీ దక్కింది?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Harvinder Singh: హర్విందర్ సింగ్ గురించి మీకు తెలుసా? ఎందుకు ఆయనకు పద్మశ్రీ దక్కింది?
    హర్విందర్ సింగ్ గురించి మీకు తెలుసా? ఎందుకు ఆయనకు పద్మశ్రీ దక్కింది?

    Harvinder Singh: హర్విందర్ సింగ్ గురించి మీకు తెలుసా? ఎందుకు ఆయనకు పద్మశ్రీ దక్కింది?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 28, 2025
    09:11 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశానికి తొలి పారాలింపిక్ బంగారు పతకాన్ని తీసుకువచ్చిన విలువిద్య క్రీడాకారుడు హర్విందర్ సింగ్, గణతంత్ర దినోత్సవానికి ముందు ప్రఖ్యాత పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.

    పారిస్ పారాలింపిక్స్ 2024లో పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ విభాగంలో హర్విందర్, పోలాండ్‌కు చెందిన లుకాజ్ సిజెక్‌ను 6-0తో ఓడించి భారత్‌కు 4వ స్వర్ణ పతకాన్ని అందించారు.

    హర్విందర్‌కు ఇది పారాలింపిక్స్‌లో రెండవ పతకం. 2021లో టోక్యో పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించారు.

    Details

    పారాలింపిక్స్ లో 29 పతకాలు

    పారిస్ ఒలింపిక్స్‌లో భారతదేశం మొత్తం ఆరు పతకాలు సాధించిన తర్వాత, పారాలింపిక్స్‌లో రికార్డు స్థాయిలో 29 పతకాలు (7 స్వర్ణాలు, 9 రజతాలు) సాధించి సత్తా చాటాడు.

    పద్మ అవార్డులు భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి. ఇవి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అనే మూడు విభాగాల్లో అందజేస్తారు.

    కళలు, సాంఘిక సేవ, ప్రజా వ్యవహారాలు, విజ్ఞాన శాస్త్రం, ఇంజినీరింగ్, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం వంటి వివిధ రంగాలలో ప్రతిభను గౌరవించడంలో ఈ అవార్డులు ప్రాధాన్యత వహిస్తాయి.

    పద్మశ్రీ అవార్డు భారతదేశంలో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం.

    Details

    హర్విందర్ సింగ్ ఎవరు?

    హర్యానాలోని కైథల్ అనే దూర గ్రామానికి చెందిన హర్విందర్ సింగ్, తన జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కొని, విలువిద్యలో అసాధారణ విజయాలు సాధించారు.

    మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన హర్విందర్, పారాలింపిక్ విజేతగా ఎదగడం అతని పట్టుదల, మనోబలానికి నిదర్శనం.

    తొమ్మిదిన్నర నెలల వయసులో హర్విందర్ డెంగీ జ్వరానికి గురయ్యాడు. ఒక స్థానిక డాక్టర్ ఇచ్చిన ఇంజక్షన్ దుష్ప్రభావం చూపడంతో అతని కాళ్లకు పని చేయడం తగ్గింది.

    ఇక 2010లో పంజాబీ యూనివర్సిటీలో విలువిద్య సాధన చేస్తున్న క్రీడాకారులను చూసి ఈ క్రీడపై ఆసక్తి పెంచుకున్నారు.

    Details

    వారి సొంత పొలంలోనే విలువిద్య శిక్షణ

    రెండు సంవత్సరాల తరువాత, లండన్ పారాలింపిక్స్‌లో క్రీడాకారులను చూసి ప్రేరణ పొందిన హర్విందర్, ఆర్ధిక శాస్త్రంలో డాక్టరేట్ చేయడం ప్రారంభించాడు.

    హర్విందర్ జీవన ప్రస్థానంలో అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. కోవిడ్ మహమ్మారి సమయంలో అతని సాధనకు అంతరాయం కలిగింది.

    కానీ అతని తండ్రి సాయంతో వారి పొలాన్ని విలువిద్య సాధన స్థలంగా మార్చి హర్విందర్ శిక్షణ పొందాడు.

    2018లో జకార్తాలో జరిగిన ఆసియా పారా గేమ్స్‌లో పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ విభాగంలో బంగారు పతకం సాధించడం హర్విందర్ కెరీర్‌లో ప్రధాన మైలురాయిగా నిలిచింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పద్మశ్రీ అవార్డు గ్రహీతలు

    తాజా

    Akhil : అఖిల్ 'లెనిన్' మూవీపై కొత్త అప్‌డేట్.. బాలీవుడ్ బ్యూటీ అనన్య స్పెషల్ సాంగ్ ప్లాన్ అక్కినేని అఖిల్
    Dhanush: చాలా రోజుల తర్వాత కలసిన ధనుష్‌, ఐశ్వర్య.. ఫోటో షేర్ చేసిన రజనీకాంత్!  రజనీకాంత్
    Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసు వేగం పెరుగుతోంది.. అమెరికా నుంచి రాబోతున్న ప్రభాకర్ రావు తెలంగాణ
    Gill-Harthik: ఎలిమినేటర్‌ మ్యాచులో గిల్, హర్థిక్ మధ్య గొడవ.. 'శుభూ బేబీ' అంటూ క్లారిటీ! శుభమన్ గిల్

    పద్మశ్రీ అవార్డు గ్రహీతలు

    padma awards 2023: ములాయం, ఎస్ఎం కృష్ణ, మహలనాబిస్‌కు పద్మ విభూషణ్- 106 మందిని వరించిన పద్మ అవార్డులు పద్మవిభూషణ్
    తెలుగింట విరబూసిన పద్మాలు: తెలంగాణ నుంచి ఐదుగురికి, ఏపీ నుంచి ఏడుగురికి అవార్డులు గణతంత్ర దినోత్సవం
    Padma Awards 2024:వెంకయ్యనాయుడు,చిరంజీవికి పద్మవిభూషణ్,మిథున్‌కి పద్మభూషణ్..2024కుగాను పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం పద్మవిభూషణ్
    Revanth reddy: 'పద్మ' అవార్డు గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల నగదు: రేవంత్ రెడ్డి  తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025