LOADING...
అరంగ్రేటం మ్యాచ్‌లోనే ఆర్సీబీకి చుక్కలు చూపించిన సుయేశ్ శర్మ ఎవరో తెలుసా?
అరంగేట్రం మ్యాచ్‌లోనే మూడు వికెట్లు తీసిన సుయేశ్ శర్మ

అరంగ్రేటం మ్యాచ్‌లోనే ఆర్సీబీకి చుక్కలు చూపించిన సుయేశ్ శర్మ ఎవరో తెలుసా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 07, 2023
03:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈడెన్ గార్డన్స్ వేదికగా ఆర్సీబీపై కోల్‌కతా నైట్ రైడర్స్ 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో కేకేఆర్ ఐపీఎల్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. అరంగేట్రం మ్యాచ్‌లోనే కేకేఆర్ తరుపున స్పిన్నర్ సుయేశ్ శర్మ సంచలనం సృష్టించాడు. కేవలం నాలుగు ఓవర్లలో 30 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో కేకేఆర్ జట్టు విజయంలో అతను కీలక పాత్ర పోషించాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన లెగ్ స్పిన్నర్ సుయేశ్ శర్మ దినేష్ కార్తీక్(9), అనుజ్ రావత్(1), కరణ్ శర్మ(1) వికెట్ల తీసి విజృంభించాడు. 205 పరుగుల లక్ష్య చేధనకు దిగిన ఆర్సీబీ 123 పరుగులకే ఆలౌటైంది.

కోల్‌కతా

సుయేశ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు : కెప్టెన్

ఢిల్లీకి చెందిన 19 ఏళ్ల సుయాష్ శర్మ మే 15, 2003న జన్మించాడు. ఫస్ట్ క్లాస్, టీ20 మ్యాచ్‌లు ఆడకముందే ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఆటగాడిగా అతను నిలిచాడు. ఢిల్లీకి చెందిన అతను అండర్-25 జట్టుకు ఆడాడు. ముఖ్యంగా కేకేఆర్ అతన్ని ఐపీఎల్ 2023 వేలంలో 20లక్షలకు కొనుగోలు చేసింది. సుయశ్ కు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడని, అతడు బౌలింగ్ చేసిన తీరు చూసి చాలా ఆనందం వేసిందని కెప్టెన్ నితీష్ రాణా చెప్పాడు. ఈ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి 4 వికెట్లు, సునీల్ నరైన్ రెండు, శార్దుల్ ఠాకూర్ ఒక వికెట్ తీశారు.