LOADING...
SRH: ఈ సీజన్‌లో సన్ రైజర్స్ హీరో ఎవరు..? రేటింగ్‌లో ఎవరు ముందున్నారంటే?
ఈ సీజన్‌లో సన్ రైజర్స్ హీరో ఎవరు..? రేటింగ్‌లో ఎవరు ముందున్నారంటే?

SRH: ఈ సీజన్‌లో సన్ రైజర్స్ హీరో ఎవరు..? రేటింగ్‌లో ఎవరు ముందున్నారంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
May 29, 2025
04:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

సన్‌ రైజర్స్ హైదరాబాద్ తమ IPL 2025 సీజన్‌ చివరి మ్యాచులో 110 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై విజయం సాధించి ముగించింది. ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్ రేసులో నిలబడలేకపోయారు. 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 7 ఓటములు, ఒక రద్దైన మ్యాచ్‌తో మొత్తంగా 13 పాయింట్లతో లీగ్‌ను ముగించారు. సీజన్‌ను రాజస్థాన్ రాయల్స్‌పై 286 పరుగులు చేసి 44 పరుగుల తేడాతో మెరుగ్గా ప్రారంభించిన ఎస్ఆర్‌హెచ్, అనంతరం స్థిరత కోల్పోయింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సరిగా ఫలితాలు రాకపోవడంతో ప్లేఆఫ్స్ ఆశలు అడియాసలయ్యాయి

Details

 ఇప్పుడు ఎస్ఆర్‌హెచ్ ఆటగాళ్ల రేటింగ్ విషయానికొస్తే..

ప్యాట్ కమిన్స్ - 7/10 SRH కెప్టెన్‌గా మోస్తరు సీజన్ గడిపాడు. మొత్తం 14 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో 97 పరుగులు చేశాడు. గరిష్ట స్కోరు 22. అభిషేక్ శర్మ - 7/10 13 ఇన్నింగ్స్‌ల్లో 439 పరుగులు చేశాడు. ఇందులో 141 స్కోరు చేసిన శతకం ఒకటి, రెండు అర్ధశతకాలు ఉన్నాయి. అయితే స్థిరత లోపించింది. ట్రావిస్ హెడ్ - 6/10 12 ఇన్నింగ్స్‌ల్లో 374 పరుగులతో సరసమైన ప్రదర్శన. చివరి మ్యాచ్‌లో 76 పరుగులు చేసినా, మొత్తం సీజన్ అంచనాల మేరకా కాదు. ఇషాన్ కిషన్ - 5/10 సీజన్‌ను శతకంతో ప్రారంభించినా, తరువాత స్థాయిని కొనసాగించలేకపోయాడు. మొత్తంగా 354 పరుగులు చేశాడు.

Details

క్లాసెన్ - 7/10 

సీజన్ మొత్తం 487 పరుగులు చేశాడు. శతకం, అర్ధశతకం ఉన్నాయి. కానీ కీలక సమయంలో కాకుండా, ఎక్కువ పరుగులు సీజన్ చివర్లో వచ్చాయి. నితిష్ కుమార్ రెడ్డి - 3/10 11 ఇన్నింగ్స్‌ల్లో 182 పరుగులే. తక్కువ స్ట్రైక్ రేట్‌తో నిరాశపరిచాడు. అనికేత్ వర్మ - 8/10 తన తొలి సీజన్‌లోనే 236 పరుగులు, స్ట్రైక్ రేట్ 166.19. గరిష్ట స్కోరు 74. భవిష్యత్తులో SRHకి కీలక ఆటగాడవుతాడు. అభినవ్ మనోహర్ - 2/10 ఫినిషర్ పాత్రలో పూర్తిగా విఫలమయ్యాడు. కేవలం 61 పరుగులు, స్ట్రైక్ రేట్ 100.

Details

మొహమ్మద్ షమీ - 3/10 

9 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు మాత్రమే. ఎకానమీ 11.23 - చాలా అధికం. హర్షల్ పటేల్ - 7/10 13 మ్యాచుల్లో 16 వికెట్లు, బెస్ట్: 4/28. బౌలింగ్ విభాగంలో నిలకడ చూపించాడు. సిమర్‌జీత్ సింగ్ - 2/10 4 మ్యాచుల్లో 2 వికెట్లు మాత్రమే. ఎకానమీ రేట్ 14.10 - SRHకి భారంగా మారాడు. జీషాన్ అంసారీ - 5/10 తొలి సీజన్, 10 మ్యాచ్‌లు, 6 వికెట్లు. అభివృద్ధికి తగిన అవకాశాలు అవసరం. జయదేవ్ ఉనద్కట్ - 8/10 7 మ్యాచ్‌ల్లోనే 11 వికెట్లు. ఎకానమీ 7.34. మరిన్ని మ్యాచ్‌ల్లో ఉపయోగిస్తే మెరుగైన ఫలితాలు అందించేవాడు

Details

 ఆడమ్ జంపా - 3/10 

కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 2 వికెట్లు, ఎకానమీ 11.75. కామిందు మెండిస్ - 4/10 5 మ్యాచ్‌ల్లో 92 పరుగులు, 2 వికెట్లు. ఓ మోస్తరు ప్రదర్శన. ఈశాన్ మాలింగా - 8/10 7 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు. ఎకానమీ 8.92. ప్రతి మ్యాచ్‌లో కనీసం ఒక వికెట్ తీసి మంచి ప్రభావం చూపించాడు. SRHకి ఈ సీజన్‌ను మిశ్రమ విజయాలుగా చెప్పుకోవచ్చు. అభిషేక్, క్లాసెన్, ఉనద్కట్, అనికేత్ వర్మ, మాలింగా లాంటి ఆటగాళ్లు మెరిసినా, ముఖ్యమైన దశల్లో స్థిరత లోపించడంతో ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి. జట్టుకు పునర్నిర్మాణం అవసరమై ఉంది.