Page Loader
PV Sindhu: సింధుకు కాబోయే భర్త వెంకట దత్త సాయి ఎవరు? ఆయనకు ఐపీఎల్‌తో ఉన్న అనుబంధం ఏమిటీ ?
సింధుకు కాబోయే భర్త వెంకట దత్త సాయి ఎవరు? ఆయనకు ఐపీఎల్‌తో ఉన్న అనుబంధం ఏమిటీ ?

PV Sindhu: సింధుకు కాబోయే భర్త వెంకట దత్త సాయి ఎవరు? ఆయనకు ఐపీఎల్‌తో ఉన్న అనుబంధం ఏమిటీ ?

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 03, 2024
01:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత బ్యాడ్మింటన్ స్టార్, డబుల్ ఒలింపిక్ పతక విజేత పివి.సింధు త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. హైదరాబాద్‌కు చెందిన 29 ఏళ్ల వెంకట దత్త సాయిని సింధు వివాహం చేసుకోనుంది. వీరి పెళ్లి డిసెంబర్ 22న ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరగనుంది. ఈ విషయాన్ని సింధు తండ్రి పీవీ రమణ వెల్లడించారు. వెంకట దత్త సాయి వివరాలు: సింధు వివాహం చేసుకోబోయే వెంకట దత్త సాయి, పోసిడెక్స్ టెక్నాలజీస్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. వీరి కుటుంబాలకు ఎప్పటి నుంచో స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఈ పరిచయం ఇప్పుడు బంధుత్వంగా మారుతోంది.

వివరాలు 

పెళ్లి ఏర్పాట్లు

"మా కుటుంబాలకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, కానీ నెల క్రితం మాత్రమే పెళ్లి ఖరారు జరిగింది. జనవరి నుంచి సింధు వరుస టోర్నమెంట్లలో పాల్గొనబోతోంది కాబట్టి, ఈ నెలలోనే వివాహాన్ని నిర్వహించాలని నిర్ణయించాం. డిసెంబర్ 22న ఉదయ్‌పూర్‌లో పెళ్లి వేడుకలు, 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఉంటుంది," అని పీవీ రమణ వెల్లడించారు. డిసెంబర్ 20న పెళ్లి వేడుకల శుభారంభం అవుతుంది. వెంకట దత్త సాయి విద్యార్హతలు వెంకట దత్త సాయి హైదరాబాద్‌కు చెందినవారు. లిబరల్ ఆర్ట్స్ & సైన్సెస్‌లో డిప్లొమా, అకౌంటింగ్ & ఫైనాన్స్‌లో బీబీఏ, బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుండి డాటా సైన్స్ & మెషీన్ లెర్నింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు.

వివరాలు 

కెరీర్ వివరాలు

తన కెరీర్‌ను జేఎస్‌డబ్ల్యూ సంస్థలో ప్రారంభించిన వెంకట దత్త సాయి, ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌తోనూ పని చేశారు. సమ్మర్ ఇంటర్న్‌గా, ఇన్-హౌస్ కన్సల్టెంట్‌గా అనేక ప్రాజెక్టుల్లో పాల్గొన్నారు. సింధు పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారడంతో, ఆమెకు కాబోయే వధువు గురించి నెటిజన్లు ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. ఆమె తదుపరి ప్రాక్టీస్‌ను త్వరలోనే ప్రారంభించనుంది.