Page Loader
వారెవ్వా.. అడమ్‌ మిల్న్ స్పీడ్‌కు బ్యాట్ రెండు ముక్కలు
రెండు ముక్కలైన బ్యాట్

వారెవ్వా.. అడమ్‌ మిల్న్ స్పీడ్‌కు బ్యాట్ రెండు ముక్కలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 05, 2023
05:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

న్యూజిలాండ్, శ్రీలంక మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతోంది. మొదటి మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్రస్తుతం టీ20 సిరీస్ ను 1-1తో న్యూజిలాండ్ సమం చేసింది. అయితే రెండో టీ20ల్లో ఆసక్తికర ఘటన చేసుకుంది. న్యూజిలాండ్ పేసర్ ఆడమ్ మిల్నే వేసిన బంతికి బ్యాట్ రెండు ముక్కలైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. న్యూజిలాండ్, శ్రీలంక మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో అడమ్ మిల్నే కళ్లు చెదిరే బంతిని వేశాడు. బంతి వేగానికి పాతుమ్ నిస్సంక్ బ్యాట్ విరిగిపోయింది. దీంతో ఒక్కసారిగా స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు అశ్చర్యానికి గురయ్యారు.

ఆడమ్ మిల్నే

5 వికెట్లు పడగొట్టిన ఆడమ్ మిల్నే

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచిన కివీస్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 19 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. కుశాల్ మెండిస్(10), కుశాల్ పెరీరా(35), అసలంక(24) మాత్రమే రెండెక్కల స్కోరు చేశారు. కివీస్ ఫాస్ట్ బౌలర్ ఆడమ్‌మిల్నే నాలుగు ఓవర్లో 5 వికెట్లు తీసి విజృంభించాడు న్యూజిలాండ్ జట్టులో టిమ్ సీఫర్ట్ 43 బంతుల్లో (3 ఫోర్లు, 6 సిక్సర్లు) 79 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో న్యూజిలాండ్ సునాయాసంగా విజయాన్ని సాధించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆడమ్ మిల్నే వేగానికి విరిగిన బ్యాట్