LOADING...
Mohammed Siraj: ఆ స్టార్ బౌలర్ లేనప్పుడే.. ఎందుకు బాగా ఆడతానంటే? : మహ్మద్ సిరాజ్
ఆ స్టార్ బౌలర్ లేనప్పుడే.. ఎందుకు బాగా ఆడతానంటే? : మహ్మద్ సిరాజ్

Mohammed Siraj: ఆ స్టార్ బౌలర్ లేనప్పుడే.. ఎందుకు బాగా ఆడతానంటే? : మహ్మద్ సిరాజ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 26, 2025
05:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్ టూర్‌లో తన అసాధారణ ప్రతిభను ప్రదర్శించాడు. అయిదు టెస్టుల సిరీస్‌లో అతను మొత్తం 23 వికెట్లు పడగొట్టి, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా పేరొందాడు. ఈ సిరీస్‌లో సిరాజ్ రెండు సార్లు అయిదు వికెట్ల జోరు చూపించి, ముఖ్యంగా చివరి టెస్టులో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివరి టెస్టులోని ఈ ప్రదర్శన వల్ల టీమ్‌ఇండియా సిరీస్‌ను 2-2తో సమం చేసుకుంది. సిరీస్ సమయంలో జస్పిత్ బుమ్రా కొన్ని మ్యాచ్‌లకు వెన్ను గాయంతో అందుబాటులో లేకపోవడంతో, పేస్ దళాన్ని సిరాజ్ ముందుండి నడిపించాడు.

Details

బాధ్యత ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది

ఈ సందర్భంలో, సిరాజ్ తనకు మెరుగైన ప్రదర్శనకు కారణమైన అంశాన్ని ఒక ఇంటర్వ్యూలో వివరించాడు. బాధ్యతను మోయడానికి అవకాశం వచ్చినప్పుడు, నేను సాధారణ సిరీస్‌లోనూ ఉత్తమంగా ఆడతాను. బాధ్యత నాలో ఆనందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని రేకెత్తిస్తుంది. జస్‌ప్రీత్ బుమ్రా గాయంతో కొంత కాలం జట్టులో లేరు. అలాగే అతడి వర్క్‌లోడ్‌ కారణంగా బౌలింగ్ యూనిట్‌లో సానుకూల వాతావరణాన్ని కొనసాగించడానికి నేను కృషి చేస్తున్నాను. నా సహచరులు, ఆకాశ్ దీప్ ఇతర బౌలర్లతో మాట్లాడినప్పుడు, మనం దీన్ని సాధించగలమని వారిలో నమ్మకాన్ని రేకెత్తించడానికి ప్రయత్నిస్తున్నాను.

Details

టెస్టుల్లో 123 వికెట్లు

మనం ఇప్పటికే సాధించిన విజయాలను మళ్లీ చేయగలమని వారికి చెప్పానని సిరాజ్ వివరించాడు. ఇప్పటి వరకు మహ్మద్ సిరాజ్ 41 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడి, 123 వికెట్లు పడగొట్టాడు, వీటిలో 31.1 యావరేజ్‌తో 5 సార్లు అయిదు వికెట్ల జోరు చూపించాడు. వన్డేల్లో 44 మ్యాచ్‌లలో 32 వికెట్లు 24 యావరేజ్‌తో సాధించాడు, ఒక్కసారి అయిదు వికెట్లు తీసాడు. 16 టీ20ల్లో 32.3 యావరేజ్‌తో 14 వికెట్లు పొందాడు. ఐపీఎల్‌లో 108 మ్యాచ్‌లు ఆడి, 30.7 యావరేజ్‌తో 109 వికెట్లు కూల్చాడు.