SA vs WI : సౌతాఫ్రికాపై వెస్టిండీస్ ఘన విజయం
జోహన్నెస్ బర్గ్‌లో జరిగిన 3వ టీ20ల్లో దక్షిణాఫ్రికాపై వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను వెస్టిండీస్ 2-0తో కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన కరేబియన్లు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ నష్టానికి 220 పరుగులు చేశారు. బ్రాండన్ కింగ్ 25 బంతుల్లో 36, నికోలస్ పూరన్ 19 బంతుల్లో 41 పరుగులు చేశారు. చివర్లో రొమారియో షెపర్డ్ (22 బంతుల్లో 44 నాటౌట్), అల్జారీ జోసెఫ్ (9 బంతుల్లో 14) చెలరేగి జట్టుకు భారీ స్కోరును అందించారు లక్ష్య చేధనకు సౌతాఫ్రికా నిర్ణత 20 ఓవర్లలో 213 పరుగులు చేసి, ఏడు పరుగుల తేడాతో ఓడిపోయింది.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా అల్జారీ జోసెఫ్
రెండో టీ20ల్లో రికార్డులను బద్దలు కొట్టిన చార్లెస్, మూడో టీ20ల్లో డకౌట్‌తో నిరాశపరిచాడు. సౌతాఫ్రికా తరుపున రీజా హెండ్రిక్స్(44 బంతుల్లో 83, 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. ఐడెన్ మార్ర్కమ్ (18 బంతుల్లో 35 నాటౌట్) రాణించినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు. చివరి ఓవర్లో 26 పరుగులు అవసరం కాగా.. సౌతాఫ్రికా 17 పరుగులను మాత్రమే సాధించింది. కరేబియన్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ ఐదు వికెట్లతో సఫారీలను కట్టడి చేశాడు. సుమారు 8 ఏళ్ల తర్వాత సౌతాఫ్రికా గడ్డపై విండీస్ జట్టు టీ20 సిరీస్‌ను గెలుచుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా అల్జారీ జోసెఫ్ నిలవగా.. జాన్సన్ చార్లెస్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యారు.