Page Loader
దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మధ్య టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే
మార్చి 25 నుంచి దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ మధ్య టీ20 సిరీస్

దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మధ్య టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 23, 2023
04:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో సిరీస్‌ను 1-1తో దక్షిణాఫ్రికా సమం చేసింది. ప్రస్తుతం ఇరు జట్లు టీ20 సిరీస్ పై కన్నేశాయి. మార్చి 25 నుంచి ఇరు జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్ లు జరగనున్నాయి. మొదటి రెండు టీ20లు సెంచ సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో జరుగుతాయి. మూడో టీ20 మ్యాచ్ జోహన్నెస్‌బర్గ్‌లో జరగనుంది. ఇప్పటివరకూ టీ20 ఫార్మాట్లో ఇరు జట్లు 16 సార్లు తలపడ్డాయి. ఇందలో సౌతాఫ్రికా 10 విజయాలను నమోదు చేయగా.. వెస్టిండీస్ ఆరు విజయాలను సాధించింది. 2021లో వెస్టిండీస్‌పై 3-2 తేడాతో సౌతాఫ్రికా టీ20 సిరీస్ ను కైవసం చేసుకుంది.

ఐడెన్ మార్ర్కామ్

తొలిసారిగా టీ20లకు కెప్టెన్‌గా ఐడెన్ మార్ర్కామ్

టీ20ల్లో సౌతాఫ్రికాకు తొలిసారిగా ఐడెన్ మార్క్రామ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సౌతాఫ్రికా జట్టు: ఐడెన్ మార్క్రామ్ (c), క్వింటన్ డి కాక్ (wk), హెన్రిచ్ క్లాసెన్ (WK), ట్రిస్టన్ స్టబ్స్ (WK), డేవిడ్ మిల్లర్, కగిసో రబడా, అన్రిచ్ నోర్ట్జే, లుంగి ఎన్గిడి, వేన్ పార్నెల్, రిలీ రోసౌ, తబ్రైజ్ షమ్సీ, జాన్సెన్, బ్జోర్న్ ఫోర్టుయిన్, సిసాండా మగలాహే వెస్టిండీస్ జట్టు: రోవ్‌మన్ పావెల్ (c), కైల్ మేయర్స్ (vc), నికోలస్ పూరన్ (wk), జాన్‌స్టన్ చార్లెస్ (wk), జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, షెల్డన్ కాట్రెల్, షమర్ బ్రూక్స్, బ్రాండన్ కింగ్, ఒబెడ్ మెకాయ్, ఓడియన్ స్మిత్, రేమన్ రీఫెర్, రొమారియో షెపర్డ్, యానిక్ కారియా