Page Loader
SA vs WI : సౌతాఫ్రికాపై ప్రతీకారం తీర్చుకోవడానికి వెస్టిండీస్ సిద్ధం
రాస్సీ వాన్ డెర్ డస్సెన్ 67.16 సగటుతో 1,679 పరుగులు చేశాడు

SA vs WI : సౌతాఫ్రికాపై ప్రతీకారం తీర్చుకోవడానికి వెస్టిండీస్ సిద్ధం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 15, 2023
05:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల వెస్టిండీస్‌ను సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌లో 2-0తో ఓడించింది. వన్డేలో కూడా వెస్టిండీస్‌ను ఓడించి సత్తా చాటాలని సౌతాఫ్రికా భావిస్తోంది. టెస్టు సిరీస్‌లో ఓడిన వెస్టిండీస్ ఎలాగైనా సౌతాఫ్రికా ప్రతీకారం తీర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ మార్చి 16 నుండి ప్రారంభం కానుంది.ఈస్ట్ లండన్‌లోని బఫెలో పార్క్‌లో మొదటి, రెండో వన్డే, 3వ వన్డే పోచెఫ్‌స్ట్రూమ్‌లోని సెన్వెస్ పార్క్‌లో జరగనుంది. దక్షిణాఫ్రికా,వెస్టిండీస్ ఇప్పటి వరకు 62 వన్డే మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. సౌతాఫ్రికా 44 విజయాలతో వెస్టిండీస్‌పై అధిపత్యం ప్రదర్శిస్తోంది. వెస్టిండీస్ కేవలం 15 విజయాలను మాత్రమే సాధించింది. దీంత ఈ సిరీస్ వెస్టిండీస్ సవాల్‌గా మారనుంది.

వెస్టిండీస్

వన్డేలో తలపడనున్న ఇరు జట్లలోని సభ్యులు

దక్షిణాఫ్రికా: టెంబాబావుమా (సి), గెరాల్డ్కోయెట్జీ, డి కాక్, టోనీడి జోర్జి, జార్న్‌ఫోర్టుయిన్, సిసాండామగాలా, లుంగిఎన్‌గిడి, ర్యాన్‌రికెల్టన్, పార్నెల్, ఫెహ్లుక్వాయో, తబ్రైజ్‌షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్, లిజాద్ విలియమ్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్. మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, ఐడెన్ మార్క్రామ్ వెస్టిండీస్: షాయ్ హోప్ (సి), రోస్టన్ చేజ్, జాసన్ హోల్డర్, బ్రాండన్ కింగ్, అకేల్ హోసేన్, రొమారియో షెపర్డ్, షమర్ బ్రూక్స్, యానిక్ కరియా, ఓడియన్ స్మిత్, నికోలస్ పూరన్ (వికెట్), కైల్ మేయర్స్, అల్జారీ జోసెఫ్, కీసీ కార్తీ, రోవ్‌మన్ పావెల్ , షానన్ గాబ్రియేల్