
WI vs PNG: రోస్టన్ చేజ్ తుఫాను ఇన్నింగ్స్... ఉత్కంఠ పోరులో పపువా న్యూ గినియాపై వెస్టిండీస్ విజయం
ఈ వార్తాకథనం ఏంటి
ICC పురుషుల టీ20 ప్రపంచకప్ 2024 రెండో మ్యాచ్ లో,వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో పాపువా న్యూ గినియాను ఓడించింది.
గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో 137 పరుగుల విజయలక్ష్యంతో ఆతిధ్య జట్టు వెస్టిండీస్,మరో ఆరు బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పపువా న్యూ గినియా ఎనిమిది వికెట్లకు 136పరుగులు చేసింది. పపువా న్యూ గినియా తరఫున సెసే బావు అత్యధికంగా 50 పరుగులు చేశాడు.బావు 43 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు.
వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కిల్పిన్ దొరిగా కూడా 18 బంతుల్లో మూడు ఫోర్ల సహాయంతో అజేయంగా 28 పరుగులు చేశాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఐదు వికెట్లతో గెలిచినా వెస్టిండీస్
A close finish 🔥
— ICC (@ICC) June 2, 2024
Roston Chase’s 42* powers West Indies to a win against PNG at Guyana 👏#T20WorldCup | #WIvPNG | 📝: https://t.co/fuT0FtoSm6 pic.twitter.com/LHX4XiOduq