LOADING...
PBKS vs RCB: చాహల్ ఆడతాడా? బ్రార్‌కు ఛాన్స్‌ ఇస్తారా?.. తికమకలో పంజాబ్ కింగ్స్ 
చాహల్ ఆడతాడా? బ్రార్‌కు ఛాన్స్‌ ఇస్తారా?.. తికమకలో పంజాబ్ కింగ్స్

PBKS vs RCB: చాహల్ ఆడతాడా? బ్రార్‌కు ఛాన్స్‌ ఇస్తారా?.. తికమకలో పంజాబ్ కింగ్స్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 03, 2025
04:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

18 ఏళ్ల తర్వాత కొత్త చాంపియన్‌ ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడనుంది. ఈసారి టైటిల్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పంజాబ్ కింగ్స్ (PKBS) పోటీపడుతున్నాయి. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవని ఈ రెండు జట్లు, ఇప్పుడు చరిత్ర సృష్టించే అవకాశాన్ని తమ చేతుల్లో వేసుకున్నాయి.

Details

చాహల్ ఆడతాడా? 

ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్ తుది జట్టులో యుజ్వేంద్ర చాహల్‌ను ఎంపిక చేస్తారా లేదా హర్ప్రీత్ బ్రార్‌కి అవకాశం ఇస్తారా అనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. వేలంలో రూ.18 కోట్లకు చహల్‌ను సొంతం చేసుకున్న పంజాబ్, అతని అనుభవాన్ని ఈ కీలక పోరులో ఉపయోగించుకోవాలని భావిస్తోంది. గాయంతో కొంతకాలం బరిలో లేకపోయిన చహల్, క్వాలిఫైయర్ 2లో ముంబయిపై మళ్లీ ఆడాడు. ఆ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్లలో 39 పరుగులు ఇచ్చి సూర్యకుమార్ యాదవ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఫామ్‌లోకి వచ్చిన చహల్, కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీయగా, ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌ల్లో రాజత్ పటీదార్‌ను రెండు సార్లు ఔట్ చేశాడు.

Details

నిలకడగా రాణిస్తున్న హర్ప్రీత్ బ్రార్

ఇక హర్ప్రీత్ బ్రార్ ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడి 10 వికెట్లు తీసి తన ఏకానమీ రేట్‌ను 8.64గా నిలిపాడు. స్టెడీ బౌలింగ్‌తో ఆకట్టుకున్నప్పటికీ, చహల్ అనుభవం, కీలక వికెట్లు తీయగలగడమే పంజాబ్‌ను అతనిపైనే మొగ్గు చూపించేలా చేస్తోంది. ఈ రెండు జట్లు లీగ్ దశను సమాన విజయాలతో ముగించాయి 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు. నెట్ రన్‌రేట్ (+0.372) ఆధారంగా పంజాబ్ టాప్ ప్లేస్‌ను దక్కించుకుంది. పరస్పర హోం మ్యాచుల్లో ఒకదానిపై మరొకటి విజయం సాధించాయి. అయితే క్వాలిఫైయర్ 1లో ఆర్సీబీ పంజాబ్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి నేరుగా ఫైనల్‌కి అడుగుపెట్టింది. ఇవాళ అహ్మదాబాద్ వేదికగా జరిగే మ్యాచులో ఐపీఎల్ విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది