
DC vs LSG: వైజాగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అదృష్టం మారుతుందా?
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో నాల్గవ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తలపడనున్నాయి.
ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్‌గా అక్షర్ పటేల్ వ్యవహరించనుండగా, లక్నో సూపర్ జెయింట్స్‌కు రిషబ్ పంత్ నాయకత్వం వహించనున్నాడు.
ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. మ్యాచ్ వైజాగ్‌లోని వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియంలో జరుగనుంది.
ఈ మైదానం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో భారీ స్కోర్లు నమోదు అయ్యే అవకాశముంది.
గత ఐపీఎల్ సీజన్‌లో ఇదే మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ 272 పరుగుల భారీ స్కోరు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Details
మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ & టెలికాస్ట్
ఈ మ్యాచ్‌ను అభిమానులు JioCinema ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించవచ్చు. టీవీ వీక్షకుల కోసం స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ లైవ్ టెలికాస్ట్ అందిస్తోంది.
హెడ్టు-హెడ్ రికార్డు
ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఐదు మ్యాచ్‌లు ఆడగా, లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మూడు విజయాలు సాధించగా, ఢిల్లీ క్యాపిటల్స్ (DC) రెండు విజయాలు సాధించాయి.
Details
టీమ్ స్ట్రెంగ్త్
ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ జట్టు మరింత బలంగా కనిపిస్తోంది. LSG జట్టులో డేవిడ్ మిల్లర్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ వంటి పవర్ హిట్టర్స్ ఉన్నారు.
మిడిల్ ఆర్డర్‌లో ఐడెన్ మార్క్రామ్, షాబాజ్ అహ్మద్, ఆయుష్ బడోని వంటి ఆటగాళ్లు ఉన్నారు.
ఇదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కెఎల్ రాహుల్, అక్షర్ పటేల్ కీలక ఆటగాళ్లుగా ఉన్నారు.
బౌలింగ్ విభాగంలో కుల్దీప్ యాదవ్, మిచెల్ స్టార్క్, ముఖేష్ కుమార్ వంటి అనుభవజ్ఞులైన బౌలర్లు ఉన్నారు. అయితే ఎల్ఎస్‌జీ జట్టు కొద్దిగా బలంగా కనిపిస్తోంది.
Details
నేటి ప్లేయింగ్ XI అంచనా
ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఎలా ఆడతాయనేది ఆసక్తికరంగా మారింది. మరి ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు విజయభాగ్యం కలిసి వస్తుందా? చూడాలి!
ఢిల్లీ క్యాపిటల్స్ (DC) ప్లేయింగ్ XI
అక్షర్ పటేల్ (కెప్టెన్), అభిషేక్ పోరెల్, కెఎల్ రాహుల్, ఫాఫ్ డు ప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ట్రిస్టన్ స్టబ్స్, మిచెల్ స్టార్క్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, మోహిత్ శర్మ.
LSG ప్లేయింగ్ XI
రిషబ్ పంత్ (కెప్టెన్ & వికెట్ కీపర్), అర్షిన్ కులకర్ణి, డేవిడ్ మిల్లర్, నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్, ఆయుష్ బడోని, అబ్దుల్ సమద్, రాజ్‌వర్ధన్ హంగర్గేకర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, షమర్ జోసెఫ్.