IPL 2026: కేకేఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. బరిలోకి దిగనున్న బౌలర్!
ఈ వార్తాకథనం ఏంటి
మూడు సార్లు ఛాంపియన్ అయిన కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రస్తుతం గాయాల సమస్యతో ఎదుర్కొంటోంది. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే జరిగిన వేలంలో జట్టుకు తీసుకున్న కొంతమంది కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా ఈ సీజన్‌లో అందుబాటులో లేకపోతున్నారని వార్తలు వచ్చాయి. హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్ మొత్తం టోర్నీకి దూరమయ్యారు. ఇంకా, రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహ్మాన్ కేకేఆర్ వదిలేయాల్సి వచ్చింది. వీటితోపాటు, రూ.18 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన మతీశ పథిరాన కూడా జట్టుకు అందుబాటులో లేకపోవడం కేకేఆర్‌కి పెద్ద ఇబ్బందిగా మారింది.
వివరాలు
త్వరలోనే జట్టులోకి..
అయితే తాజా సమాచారం ప్రకారం, శ్రీలంకకు చెందిన మతీశ పథిరాన ఇప్పటికే బౌలింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడని తెలుస్తోంది. అందువల్ల, అతడు త్వరలో కేకేఆర్ జట్టులో చేరబోతున్నాడని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సీజన్ రెండో భాగంలో అతడు జట్టుకు అందుబాటులో ఉంటాడని కూడా చెబుతున్నారు. శ్రీలంకలోని ప్రేమదాస క్రికెట్ స్టేడియంలో నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్న పథిరాన్‌ను కేకేఆర్ శిబిరంలో త్వరలో చూడవచ్చని భావిస్తున్నారు. ఐపీఎల్ 2026లో కేకేఆర్ వరుసగా రెండు మ్యాచుల్లో ఓడింది. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో, రెండో మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో జట్టు పరాజయాన్ని స్వీకరించాల్సి వచ్చింది. జట్టు బౌలింగ్ బలహీనంగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో మతీశ పథిరాన ప్రాక్టీస్ చేస్తుండటం జట్టుకు సంతోషకర సమాచారం.
వివరాలు
ఈసారి రికార్డులు ఖాయం..
శ్రీలంకకు చెందిన మతీశ పథిరాన ఐపీఎల్ 2022లో మొదటిసారిగా లీగ్‌లో ఆడాడు. ఆ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ అతడిని సైన్ చేసుకుంది. జట్టులో చేరిన కొన్ని కాలాల్లోనే అతడు విశ్వసనీయ బౌలర్‌గా ఎదిగాడు. "బేబీ మలింగు"గా ప్రసిద్ధి పొందాడు. డెత్ ఓవర్‌లలో కచ్చితంగా బంతులు విసిరి ప్రత్యర్థి బ్యాటర్లకు ఇబ్బంది పెట్టేవాడు. 2025 వరకు చెన్నైలోనే ఆడిన పథిరాన్‌ను ఐపీఎల్ 2026 సీజన్ కోసం జరిగిన వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.18 కోట్లకు తీసుకున్నారు. అతడు జట్టులో చేరిన వెంటనే కేకేఆర్ బౌలింగ్ లైన్ మరింత పటిష్టంగా మారనుంది.