Page Loader
ICC: వన్డే క్రికెట్‌లో రివర్స్ స్వింగ్‌ తిరిగి వస్తుందా..? ఐసీసీ కీలక ప్రతిపాదన!
వన్డే క్రికెట్‌లో రివర్స్ స్వింగ్‌ తిరిగి వస్తుందా..? ఐసీసీ కీలక ప్రతిపాదన!

ICC: వన్డే క్రికెట్‌లో రివర్స్ స్వింగ్‌ తిరిగి వస్తుందా..? ఐసీసీ కీలక ప్రతిపాదన!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 13, 2025
03:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే క్రికెట్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఒక కొత్త నిబంధనను తీసుకురావాలని యోచిస్తోంది. మ్యాచ్‌లో ఒక్క ఇన్నింగ్స్‌కు ఒకే బంతిని ఉపయోగించే విధంగా ఐసీసీ క్రికెట్ కమిటీ ప్రతిపాదన చేసిందని సమాచారం. ప్రస్తుత వ్యవస్థ ప్రకారం, వన్డే మ్యాచ్‌ల్లో ఒక్కో ఎండ్‌కు కొత్త బంతిని ఉపయోగిస్తున్నారు. అంటే ఒక ఇన్నింగ్స్‌లో మొత్తం రెండు బంతులు వాడుతున్నారు. ప్రతి ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లు పూర్తయ్యాక కొత్త బంతిని తీసుకొస్తున్నారు. అయితే గతంలో మాత్రం మొత్తం ఇన్నింగ్స్‌కి ఒకే బంతిని వాడుకునే విధానం ఉండేది. దీంతో బంతి పాతబడిన కొద్దీ పేస్‌ బౌలర్లకు రివర్స్ స్వింగ్ లభించేది. స్పిన్నర్లకు కూడా సహాయపడేది. కానీ ప్రస్తుతం బ్యాటర్ల ఆధిపత్యం పెరిగిందన్నారు.

Details

తుది నిర్ణయంపై త్వరలోనే 

బౌలర్లకు వ్యతిరేకంగా వ్యవస్థ మారిందని పలువురు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ అధ్యక్షతన ఉన్న ఐసీసీ క్రికెట్ కమిటీ ఒకే బంతి నిబంధనను మళ్లీ తీసుకురావాలన్న ప్రతిపాదనను చేసింది. ఒక్కే బంతితో పూర్తిస్థాయి ఇన్నింగ్స్ కొనసాగించే విధంగా కొత్త రూల్‌ను రూపొందించాలని సూచించింది. జింబాబ్వేలో జరుగుతున్న ఐసీసీ వార్షిక సమావేశాల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన అమలైతే బౌలర్లకు మళ్లీ ఊపొస్తుందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఐసీసీ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాల్సిందే.